
హైదరాబాద్: దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. విగ్రహం నిమజ్జనం చేస్తుండగా క్రేన్ పల్టీ కొట్టింది. అనుభవం లేని సర్వీస్కు టెండర్ అప్పగించడంతో సరూర్ నగర్ చెరువు దగ్గర క్రేన్ పల్టీ కొట్టింది. గత వినాయక నిమజ్జనంలో కూడా ఇదే కంపెనీకి చెందిన క్రేన్కు ప్రమాదం జరిగింది. తాజాగా కూడా.. క్రేన్ చెరువులో పడటంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు వైపు పడితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేది. అనుభవం లేని, మెయింటెనెన్స్ కూడా లేని సిటీ క్రేన్ సర్వీసెస్కు GHMC లోకల్ అధికారులు కాంట్రాక్ట్ అప్పగించారు.
ట్యాంక్ బండ్పై కూడా ఇదే కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించడం గమనార్హం. క్రేన్ నడిపే డ్రైవర్లలో అనుభవం ఉన్నవారికి మాత్రమే నిమజ్జనాల సమయంలో క్రేన్ అప్పగించాలని, అదనంగా మరో డ్రైవర్ కూడా ఉండాలి. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో.. డ్రైవర్ తప్పిదము ఉందా లేక క్రేన్ తప్పిదమా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.