అనుపమ పరమేశ్వరన్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్, తరుణ్ భాస్కర్, నరేష్ వీకే ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్‌మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. వాస్తవానికి అక్టోబర్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని రెండు వారాలు ముందుకు తీసుకొచ్చి అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు మేకర్స్.
ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకున్న ‘క్రేజీ కళ్యాణం’ లిరికల్ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
