ప్రారంభమైన క్రెడాయ్‌‌‌‌ ప్రోపర్టీ షో

ప్రారంభమైన క్రెడాయ్‌‌‌‌ ప్రోపర్టీ షో

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నార్త్ హైదరాబాద్‌‌లోని రియల్ ఎస్టేట్‌‌ ప్రాజెక్ట్‌‌లను ప్రమోట్ చేసేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ (క్రెడాయ్‌‌) హైదరాబాద్ ప్రోపర్టీ షో 12 వ ఎడిషన్‌‌ను శనివారం ప్రారంభించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌‌ ఆదివారంతో ముగుస్తుంది. ఈ ప్రోపర్టీ షో ని రాష్ట్ర లేబర్ మినిస్టర్‌‌‌‌ సీహెచ్‌‌ మల్లా రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎంఎల్‌‌ఏ  కేపీ వివేకానంద ప్రారంభించారు.

సిటీలో  రెసిడెన్షియల్‌‌, కమర్షియల్ రియల్‌‌ ఎస్టేట్‌‌కు డిమాండ్ పెరుగుతోందని, నార్త్ హైదరాబాద్‌‌లోని నమ్మదగ్గ ప్రాజెక్ట్‌‌లను బయ్యర్లకు చూపేందుకు ఈ ప్రోపర్టీ షోని నిర్వహిస్తున్నామని క్రెడాయ్ పేర్కొంది. బాలానగర్‌‌‌‌, కొంపల్లి, శామిర్‌‌‌‌పేట్‌‌, మేడ్చల్‌‌, అల్వాల్‌‌, పటాన్‌‌చెరుతో సహా నార్త్ హైదరాబాద్‌‌లోని రియల్‌‌ ఎస్టేట్ ప్రాజెక్ట్‌‌లను ఈ ప్రోపర్టీ షోలో ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రాజెక్ట్‌‌లు ఆఫర్ చేస్తున్న అపార్ట్‌‌మెంట్‌‌లు, విల్లాలు, ప్లాట్‌‌లు, కమర్షియల్ ప్లేస్‌‌లు..అన్నింటి గురించి బయ్యర్లు ఈ ఈవెంట్‌‌లో తెలుసుకోవచ్చు. ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ బాగుండడంతో  హైదరాబాద్‌‌ రియల్‌‌ఎస్టేట్ మార్కెట్‌‌ వేగంగా వృద్ధి చెందుతోందని క్రెడాయ్, హైదరాబాద్ ప్రెసిడెంట్‌‌ పీ రామకృష్ణ రావు అన్నారు.