ఆగస్టు15న క్రెడాయ్ ప్రాపర్టీ షో

ఆగస్టు15న క్రెడాయ్ ప్రాపర్టీ షో

హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంస్థ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2025ను వచ్చే నెల 15–17 తేదీల మధ్య నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఇండ్ల కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశాలను అందించే ఈ షోను ‘చాయిస్​ ఈజ్​ యువర్స్’ పేరుతో నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ ఎగ్జిబిషన్ రెరా -ఆమోదిత ప్రాజెక్ట్‌‌‌‌లను మాత్రమే ప్రదర్శిస్తుంది. 

అపార్ట్‌‌‌‌మెంట్లు, విల్లాలు, ప్లాట్లు  వాణిజ్య స్థలాలు వంటి వివిధ రకాల ప్రాజెక్టులను ఈ షోలో చూపిస్తామని  క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు జైదీప్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్​లో ఆస్తి రిజిస్ట్రేషన్ల విలువ రూ.4,300 కోట్లు దాటిందని చెప్పారు. సంవత్సరానికి 14శాతం వృద్ధి కనిపించిందని పేర్కొంది. పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం  బలమైన మౌలిక సదుపాయాల వల్ల రియల్​ఎస్టేట్​కు హైదరాబాద్​ అనుకూలమని రెడ్డి చెప్పారు.