విదేశాల్లో క్రెడిట్‌‌‌‌‌‌‌‌కార్డులు వాడినా 20% ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ కట్టాల్సిందే

విదేశాల్లో క్రెడిట్‌‌‌‌‌‌‌‌కార్డులు వాడినా 20% ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ కట్టాల్సిందే

ఇప్పటి వరకు డెబిట్‌‌‌‌‌‌‌‌, నెట్‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ ట్రాన్సాక్షన్లపైనే ఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లిమిట్‌‌‌‌‌‌‌‌
 విదేశాలకు డబ్బులు పంపినా టీసీఎస్ తప్పదు

న్యూఢిల్లీ: విదేశాల్లో  క్రెడిట్ కార్డులు వాడేవారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు డెబిట్, ఫారెక్స్ కార్డులు, బ్యాంక్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను మాత్రమే లిబరలైజ్డ్ రెమిటెన్స్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌ (ఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌) కిందకు  తీసుకురాగా, తాజాగా క్రెడిట్ కార్డులను కూడా ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌ కిందకు తెచ్చింది.  క్రెడిట్‌‌‌‌‌‌‌‌ కార్డుల ఖర్చులను ఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కిందకు  ఈ నెల 16 నుంచి ప్రభుత్వం తీసుకొచ్చింది.   నోటిఫికేషన్ ప్రకారం,  ఫారిన్ ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ చట్టంలోని రూల్‌‌‌‌‌‌‌‌ 7  ను ఫైనాన్స్ మినిస్ట్రీ పక్కన పెట్టింది. ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ లిమిట్ కంటే ఎక్కువ చేసే ఖర్చుల కోసం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ నుంచి అప్రూవల్స్ తీసుకోవడాన్ని  ఈ రూల్ మినహాయిస్తోంది. తాజాగా రూల్స్ మార్చడంతో  జులై 1 వరకు విదేశాల్లో జరిపే క్రెడిట్ కార్డుల స్పెండింగ్‌‌‌‌‌‌‌‌పై 5 శాతం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టడ్ ఎట్ సోర్స్‌‌‌‌‌‌‌‌) వేయనుండగా, బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో చెప్పినట్టు  జులై  ఒకటి నుంచి ఈ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ 20 శాతానికి పెరుగుతుంది.   మెడికల్‌‌‌‌‌‌‌‌, ఎడ్యుకేషన్ సెక్టార్లపై తక్కువ ట్యాక్స్ పడుతుంది. 

విదేశాల్లో క్రెడిట్ కార్డుల వాడకంపై 20 శాతం ట్యాక్స్ వేయడంతో  విమర్శలు పెరిగాయి. దీంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షల కంటే తక్కువ అమౌంట్‌‌‌‌‌‌‌‌ను క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా విదేశాల్లో ఖర్చు చేసిన ఇండివిడ్యువల్స్‌‌‌‌‌‌‌‌ను ఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఉండదు కాబట్టి టీసీఎస్ పడదు.  ప్రస్తుతం ఎవరైనా ఇండియన్స్ ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్ల వరకు గల  రెమిటెన్స్‌‌‌‌కు​ (విదేశాలకు పంపుకోవడానికి) ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ అనుమతి పొందాల్సిన అవసరం లేదు. ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాటితే  అనుమతులు అవసరం. సెల్లర్ల దగ్గర పేమెంట్స్ చేసేటప్పుడే  టీసీఎస్  కట్ చేస్తారు. 

ఎలా పని చేస్తుందంటే..

ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తికి ఒక క్రెడిట్ కార్డుపై రూ. 5 లక్షల వరకు లిమిట్ ఉంది. ఆయన వెకేషన్‌‌‌‌‌‌‌‌ కోసం దుబాయ్‌‌‌‌‌‌‌‌ వెళ్లాడు. అక్కడ హోటల్ బిల్స్‌‌‌‌‌‌‌‌, షాపింగ్‌‌‌‌‌‌‌‌, రెస్టారెంట్లు, క్యాబ్స్ కోసం క్రెడిట్‌‌‌‌‌‌‌‌కార్డును వాడారు.  ఆయన చేసిన మొత్తం ఖర్చు రూ. 2.5 లక్షలు అయ్యిందని అనుకుంటే, ఈ అమౌంట్‌‌‌‌‌‌‌‌పై 20 శాతం టీసీఎస్ అంటే రూ.50,000 ట్యాక్స్ పడుతుంది. అప్పుడు మొత్తం చేసిన ఖర్చు రూ.3 లక్షలు అవుతుంది.  జీఎస్‌‌‌‌‌‌‌‌టీ, ఫారెక్స్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. బ్యాంకులు ఆయన పాన్‌‌‌‌‌‌‌‌కార్డ్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా 20 శాతం టీసీఎస్‌‌‌‌‌‌‌‌ను ముందుగానే కట్ చేస్తాయి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు రమేష్ ఈ టీసీఎస్‌‌‌‌‌‌‌‌ అమౌంట్‌‌‌‌‌‌‌‌ను క్లయిమ్ చేసుకోవచ్చు.   ఇండియాలోనే ఉండి విదేశాలల్లోని మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లు, ఇతర పెయిడ్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను కొన్నా, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లపై  20 శాతం టీసీఎస్ కింద కట్ అవుతుంది.