మీ స్మార్ట్ఫోన్మొరాయిస్తుందా..? ఇలా చేయండి..జెట్స్పీడ్తో దూసుకుపోతుంది

మీ స్మార్ట్ఫోన్మొరాయిస్తుందా..? ఇలా చేయండి..జెట్స్పీడ్తో దూసుకుపోతుంది

ఇటీవల కాలంలో స్మార్ట్​ఫోన్లను చాలా రఫ్​గా వినియోగిస్తున్నారు. దీనర్ధం మీ డివైజ్ GB కొద్ది డేటాను తీసుకునే యాప్​ లను వినియోగిస్తుంటాం..వీటి పనులన్నీ స్మార్ట్​ ఫోన్​ పై చాలా భారం పడుతుంది.చివరికి అవి స్మార్ట్​ఫోన్ల స్పీడ్​ను తగ్గిస్తాయి. ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు స్మార్ట్​ఫోన్ బ్రాండ్లు ఇన్​బుల్ట్ పరిష్కారాలను అందిస్తున్నాయి. డివైజ్​ స్పీడప్​ కోసం స్మార్ట్​ ఫోన్లు అందిస్తున్న 5రకాల చిట్కాలగురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాలు చాలావరకు చాలామందికి తెలిసినవే.. కానీ స్పీడ్​ తగ్గిన స్మార్ట్ ఫోన్లను ఎలా స్పీడప్​ చేయాలో తెలియదు. 

స్మార్ట్‌ఫోన్‌ను ఎలా వేగవంతం చేయాలంటే. 

బ్యాక్ గ్రౌండ్​లో నడుస్తున్న యాప్‌లు

చాలా యాప్​లు మీకు తెలియకుండా నడుస్తూనే ఉంటాయి.ఈ యాప్లలో ఏవి ఏవిధంగా పనిచేయోలో మీ చేతుల్లోనే ఉంటుంది. ఇది మీ ఫోన్​పనితీరును స్వల్పంగా పెంచుతుంది.స్పేస్​, పవర్ని క్లియర్​ చేస్తుంది.డిసేబుల్​ చేయడం ద్వారా బ్యాక్​ గ్రౌండ్​లోయాప్ లను రన్ కాకుండా చేయొచ్చు. 

కాచ్ ఫైల్స్​నిర్వహణ 

ల్యాప్​ టాప్, డెస్క్​టాప్లలో క్యాచ్​ క్లియర్​ చేస్తుంటాం కదా.. స్మార్ట్​ఫోన్ కూడా హ్యాండ్​ హోల్డ్​ కంప్యూటరే కాబట్టి.. తరుచుగా క్యాచ్​ క్లియర్​ చేస్తుండాలి. స్మార్ట్​ ఫోన్​ వేగంగా పనిచేయాలంటే.. వ్యక్తిగత యాప్​లు, మొత్తం సిస్టమ్ సెట్టింగులలో ఎనేబుల్ చేయడం ద్వారా మీ స్మార్ట్ ఫోన్ను స్పీడప్​ చేసుకోవచ్చు. ​

డేటా స్పేస్​ను క్లియర్​ చేయడం ద్వారా.. 

కొందరు స్మార్ట్​ ఫోన్లలో చాలా యాప్​ లను వాడుతుంటారు.. చాలా యాప్​ లను ఇన్​ స్టాల్ చేసి మర్చిపోతుంటాం..దీంతో అవి GB కొద్ది డేటాను ఉపయోగిస్తుంటాయి. ప్రస్తుత మోడల్​ స్మార్ట్​ ఫోన్లలో ఇలాంటి యాప్​ లను గుర్తించి మనకు ఎప్పటికప్పుడు అలెర్ట్ చేసే ఫీచర్లు ఉన్నాయి. వాటిని ఫాలో అయి అవసరం లేని యాప్​ లను అన్ ఇన్ స్టాల్ చేయడం ద్వారా డేటా స్టోరేజ్​ పెంచుకోవచ్చు. తద్వారా మీ స్మార్ట్​ ఫోన్​ స్పీడ్​ గా పనిచేస్తుంది.  

మీ స్మార్ఫోన్​అప్డేట్​.. 

స్మార్ట్ ఫోన్ బ్రాండ్​ అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్ వర్షన్లను తెలుసుకోవడం.. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం ద్వారా కూడా మన స్మార్ట్​ ఫోన్​ ను స్పీడప్​ చేసుకోవచ్చు. స్మార్ట్​ ఫోన్​ బ్రాండ్లన్నీ ఇప్పుడు కొన్ని యేండ్లపాటు వాటి సెక్యురిటీ ప్యాచెస్​, ఇతర అప్డేట్లను అందిస్తున్నాయి. వీటితో మీ స్మార్ట్​ ఫోన్  హ్యాకింగ్ కు గురికాకుండా సురక్షితంగా ఉండటమే కాకుండా వేగంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్​ పనితీరును మెరుగుపర్చడంలో ఈ అప్డేట్లు చాలా కీలకం.. 

బ్యాటరీ లెవెల్స్​ మెయింటెన్ చేయడం ద్వారా.. 

స్మార్ట్ ఫోన్​ వేగంగా పనిచేయాలంటే మరో ఫండమెంటల్​ టిప్​ బ్యాటరీ లెవెల్స్​ మెయింటెన్ చేయడం. మీ స్మార్ట్​ ఫోన్​ ను తెలివిగా ఉపయోగిస్తూ బ్యాటరీ లెవెల్స్​ మెయింటెన్​ చేస్తే స్పీడప్​ చేయొచ్చు. వీటిలో ఒకటి ఫోన్​ బ్రైట్​ నెస్​ నిర్వహణ. always on వంటి డిస్ ప్లే ఫీచర్లు కూడా కొన్ని సందర్భాల్లో ఫోన్ ప్రాసెసింగ్​ పవర్​పై లోడ్​ ను హ్యాండిల్​చేయడంలో సాయపడతాయి. ఇది స్మార్ట్​ ఫోన్​ స్పీడ్​ చేస్తుంది. 

స్మార్ట్​ ఫోన్లలో అంతర్గతంగా ఉన్న ఇలాంటి ఫీచర్లు, చిట్కాలను పాటించడం ద్వారా మన స్మార్ట్​ ఫోన్లను కొంతమేరకు స్పీడప్​ చేసుకోవచ్చు.