
ఇండియా ప్రపంచ దేశాలతో పోటీగా ఎదగాలంటే వారంలో 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యాలు ఎంత వైరల్ అయ్యాయో చెప్పనవసరం లేదు. ఆయన తర్వాత L&T వంటి ఇతర కంపెనీల ఛైర్మన్లు 90 గంటలు చేసిన పర్లేదని మాట్లాడారు. అప్పట్లో ఇవి సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ నే క్రియేట్ చేశాయి. మనుషులా.. మెషీన్లా.. 70 గంటలు పని చేసేందుకు.. ఫ్యామిలీ ఏమై పోవాలి.. వంటి కామెంట్లతో పెద్ద పెద్ద ప్రముఖులు స్పందించారు.
నారాయణ మూర్తి చేసిన కామెంట్స్ మరువక ముందే.. ఇన్ఫోసిస్ ఎక్కువ పని చేయవద్దని స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది. ఓవర్ టైమ్ వర్క్ చేసి స్ట్రెస్ కు గురికావద్దని ఆ కంపెనీ ఎంప్లాయిస్ కు సర్క్యులర్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఎంప్లాయ్ రోజుకు 9.15 గంటల కంటే ఎక్కువ పని చేయడానికి వీళ్లేదని ఈమెయిల్స్ పంపించింది.
వర్క్ ఫ్రం హోం, రిమోట్ ఏరియాలో వర్క్ లో ఉన్నప్పుడు ఆఫీస్ హవర్స్ లోనే పనిచేయాలని.. ఇతర టైమ్ లో పని చేసి పర్సనల్ లైఫ్ కు దూరం కావద్దని కంపెనీ HR మెయిల్స్ పంపారు. అది కూడా కేవలం 9.15 గంటలే వర్క్ చేయాలని.. స్ట్రెస్ తగ్గించుకోవాలని సూచించారు. కంపెనీ టైమ్ కాకుండా ఇతర సమాయంలో పనిచేసే ఎంప్లాయ్స్ కు ఈమెయిల్స్ పంపిస్తున్నారు.
హెల్త్ రిమైండర్ పంపుతున్న HR:
కంపెనీ ఎంప్లాయిస్ కు HR హెల్త్ రిమైండర్ మెయిల్స్ పంపుతోందట. ఓవర్ టైమ్ వర్క్ చేసే ఎంప్లాయిస్ కు మెయిల్స్ పంపి.. మీరు ఎక్కువ టైమ్ పని చేస్తున్నారు.. మీ హెల్త్ జాగ్రత్త. కంపెనీ టైమ్ కంటే ఎక్కువ టైమ్ వర్క్ చేయవద్దు అని మెయిల్స్ పంపిస్తున్నారని ఎకానమిక్ టైమ్ రిపోర్ట్ విడుదల చేసింది. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలని ఈ మెసేజ్ లలో కోరుతున్నారట .
లాంగ్ టర్మ్ లో వర్క్ ప్రొఫెషనల్ గా ఉండేందుకు బ్యాలెన్స్ డ్ గా పని చేయాలని కంపెనీ కోరుతోంది. వర్క్ - పర్సనల్ లైఫ్- హెల్త్ వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలని సూచిస్తోంది. ఆఫ్ ఉన్నప్పుడు రీఫ్రెష్, రీచార్జ్ అవ్వాలని.. వర్క్ లో ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఇతరులతో ఇంటరాక్ట్ అవుతూ రీఫ్రెష్ కావాలని మెయిల్ ద్వారా సూచించింది.
కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రం హోం ఉన్న ఎంప్లాయిస్ ను రిటర్న్ టు ఆఫీస్ రూల్ ను 2023, నవంబర్ 20 న తీసుకొచ్చింది ఇన్ఫోసిస్. ఒక వేళ వర్క్ ఫ్రం హోం చేయాలనుకుంటే కనీసం 10 రోజులు ఆఫీస్ కు అటెండ్ కావాల్సిందిగా నిబంధనలు తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఎంప్లాయ్స్ వర్కింగ్ పై HR టీమ్ ట్రాకింగ్ చేస్తోందట. ఇంటి దగ్గర ఉండే ఎంప్లాయ్స్ ఓవర్ వర్క్ చేయొద్దని కంపెనీ రీసెంట్ గా మెసేజ్ లు పంపిస్తునన్నట్లు రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.