
RailOne App: భారతదేశంలోని ప్రజలు సుదూర ప్రయాణాల కోసం ఎంపిక చేసుకునేది భారతీయ రైల్వే సేవలనే. వాస్తవానికి మధ్యతరగతి ప్రజల నుంచి ధనికుల వరకు అనేక దశాబ్ధాలుగా రైల్వే సరసమైన సేవలను వాడుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల అవసరాన్నింటినీ ఒకే యాప్ ద్వారా పూర్తి చేసుకునేందుకు వీలుగా భారతీయ రైల్వే సంస్థ రైల్ వన్ పేరుతో ఒక సూపర్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనిని అధికారికంగా ప్రారంభించారు.
ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తమ రైల్వే టిక్కెట్ రిజర్వేషన్, ఫ్లాట్ ఫారం టిక్కెట్ల బుక్కింగ్, పీఎన్ఆర్ ట్రాకింగ్, ట్రైన్ స్టేటస్, కోట్ పొజిషనింగ్, రైల్ మదద్, ట్రావెల్ ఫీడ్ బ్యాక్, ఫుడ్ ఆర్డర్ చేయటం వంటి సేవలను ఒకేఒక్క యాప్ ఉపయోగించి పూర్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ప్రయాణికులు ప్రస్తుతం ఉన్న తమ రైల్ కనెక్ట్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి లాగిన్ అవ్వొచ్చు.
►ALSO READ | రైల్వే ప్రయాణికులపై ఛార్జీల మోత..నేటినుంచే(జూలై1) టికెట్ధరలు పెంపు
పైగా ఈ యాప్ లో రైల్వేలు అందిస్తున్న ఆర్-వాలెట్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. కేవలం పిన్ లేదా బయోమెట్రిక్ ఉపయోగించి యూజర్లు తమ ఖాతాలను మేనేజ్ చేసుకోవచ్చని తేలింది. పైగా యాప్ ఎలా ఉందో పరిశీలించాలనుకునే వ్యక్తులకు గెస్ట్ యాక్సెస్ ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా అందించబడుతోంది.
జూలై 1 నుంచి తత్కాల్ టిక్కెట్లు బుక్కింగ్ సేవలు కేవలం ఆధార్ వెరిఫైడ్ వ్యక్తులకు మాత్రమే అనుమతించబడుతోంది. అలాగే ఈనెలాఖరు నాటికి ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది. అలాగే రిజర్వేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చేపట్టిన సిస్టమ్ అప్ డేట్స్ కారణంగా నిమిషానికి లక్ష 50వేల టిక్కెట్లను ప్రాసెస్ చేసే కెపాసిటీ అందుబాటులోకి తీసుకురాబడింది.