
రైల్వే ప్రయాణికులకు షాక్..రైల్వే ఛార్జీలు పెరిగాయి. నాన్ ఏసీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణ ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు నేటినుంచి (జూలై1) నుంచే అమలులోకి వచ్చాయి. నాన్-ఏసీ మెయిల్ ,ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కిలోమీటరుకు ఒక పైసా ,ఏసీ తరగతులకు కిలోమీటరుకు రెండు పైసలు రైలు ఛార్జీలు పెరిగాయి.
సబర్బన్ సింగిల్ జర్నీ ఛార్జీలు ,నెలవారీ సీజన్ టిక్కెట్లలో ఎటువంటి పెరుగుదల ఉండదని మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వేషన్ ఫీజులు, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీలు ,ఇతర ఛార్జీలు మారవు అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
భారతీయ రైల్వే టికెట్ ధరలను పెంచింది. ఈ పెంచిన ధరలు జులై 1, 2025 నుండి అమలులోకి వచ్చాయి. రైల్వే సేవలను మెరుగుపర్చేందుకు ఛార్జీలను పెంచినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.కిలోమీటరుకు 0.5 పైసలు అదనంగా వసూలు చేస్తారు.
జనరల్/సెకండ్ క్లాస్ (నాన్-ఏసీ, నాన్-సబర్బన్) రైళ్లలో 500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. 501నుంచి -1500 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 5రూపాయలు పెంచారు.1501నుంచి -2500 కిలోమీటర్ల దూరానికి రూ10 పెంచారు. 2501నుంచి -3వేల కిలోమీటర్ల దూరానికి 15 లు పెంచారు.
కిలోమీటరుకు 0.5 పైసలు అదనంగా వసూలు చేస్తారు. స్లీపర్ క్లాస్ (నాన్-ఏసీ, నాన్-సబర్బన్) రైళ్లలో కిలోమీటరుకు 0.5 పైసలు పెంచారు. ఫస్ట్ క్లాస్ (నాన్-ఏసీ, నాన్-సబర్బన్) రైళ్లలో కిలోమీటరుకు 0.5 పైసలు పెంచారు.
►ALSO READ | Bank Holidays: జూలైలో బ్యాంక్స్ 13 రోజులు క్లోజ్.. ఏఏ తేదీల్లో అంటే..?
మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు (నాన్-ఏసీ) లలో సెకండ్ క్లాస్ కు కిలోమీటరుకు 1 పైస, స్లీపర్ క్లాస్ లో కిలోమీటరుకు 1 పైసా పెరుగుదల. ఫస్ట్ క్లాస్ రైళ్లలో కిలోమీటరుకు 1 పైసా పెంచారు.
ఏసీ క్లాసులలో(మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు - ఛైర్ కార్, 3-టైర్/3-ఎకానమీ, 2-టైర్, ఫస్ట్/ఎగ్జిక్యూటివ్ క్లాస్/ఎగ్జిక్యూటివ్ )లలో కిలోమీటరుకు 2 పైసలు పెంచారు.
సబర్బన్ రైళ్లు, సీజన్ టికెట్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. రిజర్వేషన్ ఫీజులు, సూపర్‌ఫాస్ట్ సర్‌చార్జీలు మారలేదు. జులై 1, 2025 ముందు బుక్ చేసుకున్న టికెట్‌లకు పాత ధరలే వర్తిస్తాయి.
తత్కాల్ బుకింగ్‌లో మార్పులు:
జులై 1, 2025 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి చేశారు. జులై 15 నుంచి ఆన్‌లైన్, కౌంటర్, అధీకృత ఏజెంట్ల ద్వారా చేసే అన్ని తత్కాల్ బుకింగ్‌లకు ఆధార్ ఆధారిత ఓటీపీ ధ్రువీకరణ కూడా తప్పనిసరి చేశారు.