Credit Card Spending ..క్రెడిట్ కార్డు తెగ గీకేస్తున్నారు..ఆల్ టైం రికార్డు.. ఒక్క నెలలో 2.17లక్షల కోట్ల వినియోగం

Credit Card Spending ..క్రెడిట్ కార్డు తెగ గీకేస్తున్నారు..ఆల్ టైం రికార్డు.. ఒక్క నెలలో 2.17లక్షల కోట్ల వినియోగం

దేశంలో క్రెడిట్​ కార్డు ట్రాన్సాక్షన్స్​ ఆల్​ టైం రికార్డు స్థాయికి చేరాయి. గత ఐదేళ్లలో ఎప్పుడు లేనంతగా క్రెడిట్​ కార్డుల ద్వారా లావాదేవీలు భారీ గా పెరిగాయి.బ్యాంకుల పండుగ ఆఫర్లు, పండుగ సీజన్ ఖర్చు ,GST తగ్గింపు, కొత్త కార్డుల జారీ కారణంగా క్రెడిట్​ కార్డులకు డిమాండ్ పెరిగిందని రిపోర్టులు చెబుతున్నాయి. 

సెప్టెంబర్​ నెలలో ప్రవేట్​ రంగ బ్యాంకులు (PVBలు)  జారీ చేసిన క్రెడిట్ కార్డులు మార్కెట్లో 74.2 శాతం వినియోగించాయి. అయితే గతం కంటే సెప్టెంబర్​ నెలలో వాటి వినియోగం తగ్గింది. మరో వైపు ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBలు) తమ వాటాను పెంచుకున్నాయి. 18.4 శాతం నుంచి 21.2 శాతానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్​ కార్డు వినియోగం పెరిగింది.

రిపోర్టుల ప్రకారం..మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య సెప్టెంబర్ 2024లో 10.6 కోట్లు ఉండగా  సెప్టెంబర్ 2025లో 11.3 కోట్లకు పెరిగింది. ఇది క్రమంగా క్రెడిట్​ కార్డుల వినియోగం పెరుగుతుంది అని చెప్పేందుకు ఉదాహరణ. 

సెప్టెంబర్​ నెలలో ప్రైవేట్​ రంగ బ్యాంకుల  క్రెడిట్​ కార్డు సగటు ఖర్చు రూ.20వేల 011 లు ఉండగా.. ఇది ఏడాదిలో 3.0 శాతం పెరుగుదల. దీనికి విరుద్ధంగా  ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSB)లు క్రెడిట్​కార్డుల అత్యధిక వినియోగం30 శాతం  పెరిగింది.  సగటున ఒక్క కార్డుపై ఖర్చు రూ. 16వేల 927 కు పెరిగింది. అయితే మొత్తం రిటైల్ రుణాలలో క్రెడిట్ కార్డ్ బకాయిల వాటా సెప్టెంబర్ 2025లో 4.5 శాతానికి తగ్గింది.ఇది గత సంవత్సరం ఇది 4.9 శాతంగా ఉంది. ఇతర రిటైల్ విభాగాలు విస్తరించినప్పటికీ క్రెడిట్ కార్డ్ బకాయిలలో సాపేక్ష మందగమనాన్ని సూచిస్తుంది.

2025 ఆగస్టు నాటికి మొత్తం క్రెడిట్ కార్డ్ బకాయిలు రూ.2.82 లక్షల కోట్లు. ఆగస్టు 2025లో రూ.2.89 లక్షల కోట్లు. సెప్టెంబర్ 2024లో రూ.2.72 లక్షల కోట్లు.  అంటే సంవత్సరానికి 3.7 శాతం పెరిగింది. మొత్తం రిటైల్ రుణాలలో క్రెడిట్ కార్డ్ బకాయిల వాటా సెప్టెంబర్ 2025లో 40 బేసిస్ పాయింట్లు తగ్గి 4.5 శాతానికి చేరుకుంది. ఇది అంతకు ముందు సంవత్సరం 4.9 శాతంగా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.