అన్నీ అప్పులేనా : ఒక్క ఏప్రిల్ నెలలోనే 18 శాతం పెరిగిన క్రెడిట్ కార్డు వాడకం

అన్నీ అప్పులేనా : ఒక్క ఏప్రిల్ నెలలోనే 18 శాతం పెరిగిన క్రెడిట్ కార్డు వాడకం

ఒక్క ఏప్రిల్ నెలలోనే క్రెడిట్ ద్వారా చేసిన చెల్లింపులు 18శాతం పెరిగాయాని. ఇండియాలో క్రెడిట్ కార్డ్ లావాదేవీల వల్ల రూ.1.57 ట్రిలియన్‌లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా వెల్లడించింది. మొత్తం కార్డ్ ఖర్చులు మార్చిలో నివేదించబడిన రూ.1.65 ట్రిలియన్ల కంటే చాలా తక్కువగా ఉన్నాయి.

ఆన్‌లైన్ లావాదేవీల పెరుగుదల కారణంగా ఏప్రిల్‌లో క్రెడిట్ కార్డ్ వాడకం పెరింగింది. ఏప్రిల్‌లో ఇ- -కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై16.5% క్రెడిట్ కార్డు ఖర్చులు పెరిగి రూ.94,516 కోట్లకు చేరగా, పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ వద్ద ఖర్చులు 20% పెరిగి రూ.61,982 కోట్లకు చేరుకున్నాయి. ATMలో డ్రా చేసిన డబ్బులు రూ.458 కోట్లుగా ఉన్నాయి. మార్చి 31 నాటికి 101.8 మిలియన్లు ఉన్న కార్డుల సంఖ్య ఏప్రిల్ 30 నాటికి 18.5% పెరిగి 102.5 మిలియన్లకు చేరుకుంది.