యూఎస్ బాండ్‌‌ మార్కెట్‌‌పై మూడీస్ నెగెటివ్‌‌

యూఎస్ బాండ్‌‌ మార్కెట్‌‌పై మూడీస్ నెగెటివ్‌‌

న్యూఢిల్లీ : యూఎస్ గవర్నమెంట్ బాండ్ల  ఔట్‌‌లుక్‌‌ను క్రెడిట్ రేటింగ్‌‌ ఏజెన్సీ మూడీస్‌‌ ఇన్వెస్టర్స్‌‌ సర్వీస్‌‌  తగ్గించింది. ముందిచ్చిన ‘స్టేబుల్‌‌’ ఔట్‌‌లుక్‌‌ను  ‘నెగెటివ్‌‌’ కు డౌన్‌‌గ్రేడ్ చేసింది. వడ్డీ రేట్లు పెరగడంతో ఖర్చులు పెరుగుతున్నాయని, యూఎస్ కాంగ్రెస్‌‌లో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదనే కారణాలను చూపింది. 

యూఎస్‌‌ గవర్నమెంట్ బాండ్లపై ‘ఏఏఏ’ రేటింగ్‌‌ను మాత్రం కొనసాగించింది. గతంలో ఫిచ్ రేటింగ్ యూఎస్ డెట్ మార్కెట్‌‌ ఔట్‌‌లుక్‌‌ను ‘ఏఏఏ’ నుంచి ‘ఏఏ +’ కు తగ్గించిన విషయం తెలిసిందే. ఫైనాన్షియల్ సంస్థలు రేటింగ్‌‌లు తగ్గించేస్తే ప్రభుత్వాలు ఎక్కువ వడ్డీ చెల్లించి ఫండ్స్ సేకరించాల్సి ఉంటుంది.