చర్లపల్లి రైల్వే స్టేషన్‎లో క్రూ లాబీ ప్రారంభం

చర్లపల్లి రైల్వే స్టేషన్‎లో క్రూ లాబీ ప్రారంభం

హైదరాబాద్​సిటీ, వెలుగు: చర్లపల్లి రైల్వే స్టేషన్‎ను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్​ శ్రీవాస్తవ శుక్రవారం తనిఖీ చేశారు. ఇటీవలే ఈ స్టేషన్​ను రూ. 413 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసి పలు రైళ్లు ఆగే సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ కొత్త రన్నింగ్ రూమ్, క్రూ లాబీని ప్రారంభించారు.

 కంప్యూటరైజ్డ్ బెడ్ ఆక్యుపేషన్, మహిళా సిబ్బందికి ఏర్పాటు చేసిన ప్రత్యేక వసతి, ఎయిర్ కండిషనింగ్, యోగా, ధ్యానం కోసం నిర్మించిన గదులు, మాడ్యులర్ కిచెన్, ఆర్​ఓ ప్లాంట్లు, సీసీ టీవీ నిఘా సౌకర్యాలను పరిశీలించారు. జనరల్ మేనేజర్ షెడ్​లో ఉన్న ఖాళీ అమృత్ భారత్ రైలు రేక్​ను తనిఖీ చేసి, కోచ్​లలో అందించిన కొత్త సౌకర్యాలను సమీక్షించారు. వెంట సికింద్రాబాద్ డీఆర్ఎం డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ ఉన్నారు.