
ముషీరాబాద్, వెలుగు: హిమాయత్ నగర్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్ సెంట్రల్ జోన్, దోమలగూడ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. హిమాయత్ నగర్‌కు చెందిన శ్రీరాజ్ బాబు ఆటో మొబైల్ షాపు నిర్వహిస్తుండగా, ఈజీ మనీ కోసం బెట్టింగ్దందా మొదలుపెట్టారు.
ఇందుకోసం చిక్కడపల్లిలో ట్రావెల్ బిజినెస్ చేస్తున్న సాయినాథ్, ప్రైవేటు జాబ్ చేస్తున్న రేగళ్ల గోపీనాథ్‌ను 5 శాతం కమీషన్‌తో ఏజెంట్లుగా నియమించుకున్నాడు. ఆ తర్వాత విదేశాల నుంచి బెట్టింగ్‌యాప్ కొనుగోలు చేసి, బాల్ టూ బాల్బెట్టింగ్నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారంతో హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్ 8లోని ఓ అపార్ట్మెంట్ లో పోలీసులు దాడి చేసి, ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. రూ.1.20 లక్షల నగదు, బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్చేసిన మూడు సెల్ ఫోన్లు స్వాధీనం
చేసుకున్నారు.