
లక్నో: ఇండియా పేసర్ దీపక్ చహర్ తొడ కండరాల గాయం కారణంగా శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. కోల్‌కతాలో వెస్టిండీస్‌తో మూడో టీ20 సందర్భంగా చహర్ గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో లంకతో సిరీస్ నుంచి తప్పుకున్న చహర్ బెంగళూరు ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో పాల్గొంటాడని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే జస్‌ప్రీత్ బుమ్రా టీమ్‌లోకి వచ్చిన నేపథ్యంలో చహర్‌కు రీప్లేస్‌మెంట్‌గా మరొకరిని తీసుకోవడం లేదని తెలిపింది. కాగా, మార్చి చివరి వారంలో మొదలయ్యే ఐపీఎల్ వరకు దీపక్ చహర్ ఫిట్‌నెస్ సాధిస్తాడేమో చూడాలి. కాగా, లంకతో టీ20 సిరీస్ కోసం రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా లక్నోలోని ఎకాన స్టేడియంలో ప్రాక్టీస్ చేసింది. మరోవైపు దసున్ షనక కెప్టెన్సీలోని శ్రీలంక మంగళవారం ఉదయం లక్నోలో ల్యాండ్ అయింది. సాయంత్రం నెట్ సెషన్లో పాల్గొంది. ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్ గురువారం జరుగుతుంది.