2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచ కప్.. వేదికలు ఖరారు చేసిన క్రికెట్ దక్షిణాఫ్రికా

2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచ కప్.. వేదికలు ఖరారు చేసిన క్రికెట్ దక్షిణాఫ్రికా

సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న 2027 వన్డే వరల్డ్ కప్ వేదికలు ఖరారయ్యాయి. సౌతాఫ్రికాలోని మొత్తం ఎనిమిది నగరాల్లో 44 మ్యాచ్‌లు.. మరో 10 మ్యాచ్‌లకు జింబాబ్వే, నమీబియా ఆతిధ్యమిస్తాయిని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కన్ఫర్మ్ చేసింది. సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్, ప్రిటోరియా, కేప్ టౌన్, డర్బన్, గ్క్వెబెర్హా, బ్లూమ్‌ఫోంటైన్, తూర్పు లండన్, పార్ల్ వేదికలుగా వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. "ఆఫ్రికన్ గడ్డపై చివరి ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్ జరిగి ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచాయి". అని CSA అధ్యక్షుడు రిహాన్ రిచర్డ్స్ ఒక ప్రకటనలో తెలిపారు.

2027 వరల్డ్ కప్ లో ఈ సారి మొత్తం 14 జట్లకు ఐసీసీ అవకాశం కల్పించింది. ఈ మెగా టోర్నీ 2003 తరహాలో జరుగుతుందని స్పష్టం చేసింది. మొత్తం 14 జట్లు రెండు గ్రూప్ లుగా విభజించబడతాయి. గ్రూప్-ఏ లో ఏడు జట్లతో పాటు గ్రూప్-బి మరో ఏడు జట్లు లీగ్ మ్యాచ్ లు ఆడతాయి. రెండు గ్రూప్స్ లో టాప్- 3 లో నిలిచిన సూపర్-6 కు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్ లో ఒక్కో టీం మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున మొత్తం 5 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. టాప్- 4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఇక సెమీ ఫైనల్ లో గెలిచిన జట్లు రెండు జట్లు టైటిల్ కోసం ఫైనల్లో తలపడతాయి. 

►ALSO READ | డ్రీమ్ 11తో తెగతెంపులు చేసుకున్న బీసీసీఐ.. 358 కోట్ల రూపాయల కాంట్రాక్టు రద్దు !

ఈ మెగా టోర్నీకి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిధ్యమివ్వనున్నాయి. హోస్ట్ కాబట్టి ఈ జట్లు నేరుగా వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తాయి. వీటితో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్-8 లో నిలిచిన జట్లు ఈ మెగా టోర్నీకి క్వాలిఫై అవుతాయి. మిగిలిన స్థానాల కోసం మిగతా జట్లు వరల్డ్ కప్ క్వాలిఫై మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది. 2023లో   అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో టీమిండియాను ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఓడించి ఆరోసారి వరల్డ్ కప్ టైటిల్ తమ ఖాతాలో వేసుకుంది.