టీ20 వరల్డ్ కప్కు టీమ్ రెడీ చేసే పనిలో ఇండియా

 టీ20 వరల్డ్ కప్కు టీమ్ రెడీ చేసే పనిలో ఇండియా
  • కాంబినేషన్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌
  • టాస్ కీలకం

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా: టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌నకు సరిగ్గా ఎనిమిది నెలలు మిగిలుండగా  రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ కెప్టెన్సీలోని ఇండియా  ఆ టోర్నీ కోసం సరైన కాంబినేషన్స్‌‌‌‌‌‌‌‌ను సెట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడంపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో మూడు టీ20ల సిరీస్‌‌‌‌‌‌‌‌తోనే ఆ దిశగా అడుగులు వేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈడెన్‌‌‌‌‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌ వేదికగా బుధవారం జరిగే ఫస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ నుంచే వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌  ప్రిపరేషన్స్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేయనుంది. వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లో విండీస్‌‌‌‌‌‌‌‌ను వైట్‌‌‌‌‌‌‌‌వాష్‌‌‌‌‌‌‌‌ చేసిన నేపథ్యంలో షార్ట్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లోనూ రోహిత్‌‌‌‌‌‌‌‌సేన ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. కానీ గత టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో హాట్‌‌‌‌‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగిన కోహ్లీ కెప్టెన్సీలోని ఇండియా గ్రూప్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌లోనే ఇంటిదారి పట్టి విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు కెప్టెన్‌‌‌‌‌‌‌‌తో పాటు కోచింగ్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ మారింది. ఈ నేపథ్యంలో సమస్యలను పరిష్కరించి టీమ్‌‌‌‌‌‌‌‌ను ట్రాక్‌‌‌‌‌‌‌‌లోకి తేవాలని కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌, కోచ్‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌ భావిస్తున్నారు. 
విరాట్​ ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి వస్తడా
రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ ఓపెనర్ లోకేశ్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ గాయపడటంతో ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌గా ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ఆక్షన్‌‌‌‌‌‌‌‌ హీరో ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌ బరిలో దిగనున్నాడు.   మహారాష్ట్ర రన్‌‌‌‌‌‌‌‌ మెషీన్‌‌‌‌‌‌‌‌ రుతురాజ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌ రూపంలో మరో ఆప్షన్‌‌‌‌‌‌‌‌ కనిపిస్తోంది. ఫుల్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న రుతురాజ్‌‌‌‌‌‌‌‌ను బెంచ్‌‌‌‌‌‌‌‌పై కూర్చోబెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే, తాము ప్రయోగాలు చేయకుండా వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ ప్రాబబుల్స్‌‌‌‌‌‌‌‌కు ఎక్కువ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ లభించేలా చూస్తామంటున్న  రోహిత్‌‌‌‌‌‌‌‌ ఎవరి వైపు మొగ్గు చూపుతాడన్నది ఆసక్తిగా మారింది.  

అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో  వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లో మూడు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో ఫెయిలైన కోహ్లీపై ఇప్పుడు చాలా ప్రెజర్‌‌‌‌‌‌‌‌ ఉంది. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో తన చివరి సెంచరీని  కోహ్లీ 2019 నవంబర్‌‌‌‌‌‌‌‌లో ఇదే గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో డేనైట్‌‌‌‌‌‌‌‌ టెస్టులో చేశాడు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఉన్నప్పటికీ కోహ్లీ తన బ్యాట్‌‌‌‌‌‌‌‌కు పని చెప్పాల్సిందే. అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో వైట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌ ఇండియాను దెబ్బతీస్తోంది. వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లో రాణించిన  శ్రేయస్‌‌‌‌‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ అదే ఫామ్‌‌‌‌‌‌‌‌ కొనసాగిస్తే దీనికి పరిష్కారం దొరికినట్టే.

ఇక,బ్యాట్‌‌‌‌‌‌‌‌తోనూ రాణించే పేసర్లు  శార్దూల్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌, దీపక్‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌, హర్షల్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ ఉండటంతో  లోయర్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ కూడా స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ అయింది.  బుమ్రా ఆబ్సెంట్‌‌‌‌‌‌‌‌లో మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌ పేస్‌‌‌‌‌‌‌‌ అటాక్‌‌‌‌‌‌‌‌ను లీడ్‌‌‌‌‌‌‌‌ చేయనున్నాడు.  అవేశ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ కూడా రేసులో ఉన్న నేపథ్యంలో  సీనియర్‌‌‌‌‌‌‌‌ భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌కు ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌లో చోటు కష్టమే. వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటిన  చహల్‌‌‌‌‌‌‌‌ రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ స్పిన్‌‌‌‌‌‌‌‌ ఆప్షన్‌‌‌‌‌‌‌‌ కాగా.. అతనికి తోడు ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ లెగ్​ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రవి బిష్నోయ్‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌ రావొచ్చు.  
విండీస్‌‌‌‌‌‌‌‌ పోటీ ఇస్తుందా?
వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లో వైట్‌‌‌‌‌‌‌‌వాష్‌‌‌‌‌‌‌‌ అయిన కీరన్‌‌‌‌‌‌‌‌ పొలార్డ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీలోని వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ తమకు మంచి రికార్డున్న టీ20ల్లో అయినా ఇండియాకు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. టీ20 స్పెషలిస్టులతో నిండిన కరీబియన్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌... హోమ్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల టీ20  సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ను 3–2 తేడాతో ఓడించి ఇక్కడకు వచ్చింది. లోయర్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ వరకూ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసే సామర్థ్యం, చాలా మంది హిట్టర్లు ఉండటంతో వన్డేల్లో మాదిరిగా కాకుండా  ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో కరీబియన్స్‌‌‌‌‌‌‌‌ నుంచి సవాల్‌‌‌‌‌‌‌‌ ఆశించొచ్చు. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో లాస్ట్‌‌‌‌‌‌‌‌ టీ20 చివరి ఓవర్లో నాలుగు బాల్స్‌‌‌‌‌‌‌‌లో నాలుగు వికెట్లు పడగొట్టడంతోపాటు  ఇండియాతో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లోనూ బాగా ఆడిన జేసన్‌‌‌‌‌‌‌‌ హోల్డర్‌‌‌‌‌‌‌‌ టూరిస్ట్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో కీలకం కానున్నాడు. అలాగే, ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్లు ఒడియన్‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌, అకీల్‌‌‌‌‌‌‌‌ హొస్సేన్‌‌‌‌‌‌‌‌ కూడా సత్తా చాటేందుకు రెడీగా ఉన్నారు. 2016లో టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఈడెన్‌‌‌‌‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌లో జరిగే ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో రాణించాలని విండీస్‌‌‌‌‌‌‌‌ పట్టుదలగా ఉంది. 
కోహ్లీని ఒంటరిగా వదిలేయండి: రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌
 కొంతకాలంగా బ్యాటింగ్ లో ఫెయిలవుతున్న విరాట్ కోహ్లీకి కెప్టెన్ రోహిత్  మద్దతుగా నిలిచాడు. కోహ్లీని ఒంటరిగా వదిలేస్తే అంతా సర్దుకుంటుందన్నాడు.  ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టీ20కి ముందు మంగళవారం జరిగిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో  కోహ్లీ గురించి మీడియా అడిగిన ప్రశ్నలపై హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్ అసహనం వ్యక్తం చేశాడు. ‘మీరు (మీడియా) కోహ్లీ విషయంలో కొంత కాలం సైలెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటే అంతా సర్దుకుంటుంది. అతడి ఫామ్ గురించి ఎలాంటి ఆందోళన లేదు. తను  పదేళ్లుగా  టీమ్ కు సేవలందిస్తున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్అనుభవమే అతడిని ఒత్తిడి జయించేలా చేస్తుంది’ అని రోహిత్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ ఆక్షన్​ ముగియడంతో  ప్రస్తుతం ప్లేయర్ల దృష్టంతా నేషనల్​ టీమ్​పైనే ఉందన్నాడు. ‘ఆక్షన్ ముగిసింది. ఇక దాని గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. ఆ లీగ్ కేవలం రెండు నెలలు మాత్రమే జరుగుతుంది. మిగతా 10 నెలలు మేము నేషనల్ టీమ్ కే ఆడాలి’ అని చెప్పాడు.
టీమ్స్(అంచనా): రోహిత్ (కెప్టెన్), ఇషాన్, కోహ్లి, పంత్ (కీపర్),సూర్య కుమార్, శ్రేయస్, హర్షల్, దీపక్/అవేశ్, సిరాజ్, చహల్, బిష్నోయ్/కుల్దీప్.
వెస్టిండీస్: మేయర్స్, బ్రెండర్, పూరన్ (కీపర్), పొలార్డ్ (కెప్టెన్), పావెల్, హోల్డర్, రొమారియో, అలెన్, ఒడియన్, అకీల్, కాట్రెల్.
పిచ్/వాతావరణం
ఐదు రోజుల్లో జరిగే మూడు మ్యాచ్ ల కోసం క్యాబ్ మూడు పిచ్ లు రెడీ చేసింది. వికెట్ పై మంచి బౌన్స్ లభించే ఛాన్సుంది. కోల్ కతా లో రాత్రిపూట వాతావరణం చల్లగా ఉంది. మంచు కూడా పడుతోంది. కాబట్టి టాస్ కీలకం కానుంది.