ఇవాళ వెస్టిండీస్‌తో థర్డ్‌ టీ20

ఇవాళ వెస్టిండీస్‌తో థర్డ్‌ టీ20
  • తొలి విజయం కోసం కరీబియన్ల ప్రయత్నాలు
  • రా.7 నుంచి స్టార్​ స్పోర్ట్స్​లో

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా: వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో థర్డ్‌‌‌‌‌‌‌‌ టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కోసం ఇండియా రెడీ అయ్యింది. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే 2–0తో గెలుచుకున్న రోహిత్‌‌‌‌‌‌‌‌సేన.. ఆదివారం జరిగే ఈ పోరులోనూ గెలిచి క్లీన్‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌‌‌‌‌ చేయాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. అయితే కోహ్లీ, పంత్‌‌‌‌‌‌‌‌కు బ్రేక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌.. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ప్రయోగాలకు రెడీ అవుతున్నది. దీంతో శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌, రుతురాజ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌కు ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌లో ప్లేస్‌‌‌‌‌‌‌‌ ఖాయంగా కనిపిస్తున్నది. టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌కు మరో ఎనిమిది నెలలే టైమ్‌‌‌‌‌‌‌‌ ఉండటంతో.. ఆ లోపు కుర్రాళ్లను సెట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని టీమిండియా మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ భావిస్తోంది. అందులో భాగంగా రిజర్వ్‌‌‌‌‌‌‌‌ ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా ఎవర్ని ఎంచుకోవాలన్న దానిపై రోహిత్‌‌‌‌‌‌‌‌ కసరత్తు మొదలుపెట్టాడు. కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ గైర్హాజరీ, ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌ ఫెయిల్యూర్స్​ కారణంగా ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌ను రుతురాజ్‌‌‌‌‌‌‌‌కు ఇవ్వాలని ప్లాన్స్‌‌‌‌‌‌‌‌ వేస్తున్నాడు. ఇక కోహ్లీ, పంత్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో కొత్త మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ కోసం వేట మొదలైంది.

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ముగిసిన వెంటనే లంకతో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ అవుతుంది. కాబట్టి కోహ్లీ ప్లేస్‌‌‌‌‌‌‌‌ను శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ భర్తీ చేయనున్నాడు. ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా ఫెయిల్‌‌‌‌‌‌‌‌ అయిన ఇషాన్‌‌‌‌‌‌‌‌ను మిడిల్‌‌‌‌‌‌‌‌లో పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌, వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌, దీపక్‌‌‌‌‌‌‌‌ హుడా కూడా ప్లేస్‌‌‌‌‌‌‌‌లను పర్మినెంట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ ఎక్కువ ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌ కోసం ప్రయత్నిస్తున్నారు. బుమ్రా, షమీ గైర్హాజరీతో భువీ, హర్షల్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ను కొనసాగించొచ్చు. అయితే ఆవేశ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ కూడా రేస్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాడు. శార్ధూల్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌, దీపక్‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌లలో ఎవరికి చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తారో చూడాలి. స్పిన్నర్లుగా కుల్దీప్‌‌‌‌‌‌‌‌, చహల్‌‌‌‌‌‌‌‌లో ఒకరికే అవకాశం దక్కుతుంది. 
తొలి విజయం కోసం..
మరోవైపు ఈ టూర్‌‌‌‌‌‌‌‌లో విండీస్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ విన్‌‌‌‌‌‌‌‌ కోసం చాలా తీవ్రంగా ట్రై చేస్తోంది. సెకండ్‌‌‌‌‌‌‌‌ టీ20లో విక్టరీ దగ్గర్లోకి వచ్చి ఆగిపోవడంతో... ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌పై ఫుల్‌‌‌‌‌‌‌‌ ఫోకస్​ చేస్తున్నది. అయితే సెకండ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ను యథావిధిగా కొనసాగించే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. అ పిచ్‌‌‌‌‌‌‌‌ కూడా ఛేజింగ్‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా ఉందని హింట్స్‌‌‌‌‌‌‌‌ వస్తున్న నేపథ్యంలో.. టీమ్‌‌‌‌‌‌‌‌లో ఒకటి, రెండు మార్పులు ఉండొచ్చని సమాచారం. ఈ మ్యాచ్​లోనూ పావెల్​, పూరన్​ కీలకం కానున్నారు.
టీమ్స్‌‌‌‌ (అంచనా)
ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్,  శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్,  వెంకటేష్ అయ్యర్ / దీపక్ హుడా, హర్షల్ పటేల్, దీపక్ చాహర్/శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్‌‌ కుమార్ / మహమ్మద్ సిరాజ్ / ఆవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ / కుల్దీప్ యాదవ్. 
వెస్టిండీస్‌‌: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, రోవ్‌‌మాన్ పావెల్, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్‌‌, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకేల్ హోస్సేన్‌‌, షెల్డన్ కాట్రే.