నేడు భారత్-దక్షిణాఫ్రికా రెండో వన్డే

నేడు భారత్-దక్షిణాఫ్రికా రెండో వన్డే
  • మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం

భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ రెండో వన్డే జరగనుంది. తొలివన్డేలో ఓడిపోయిన భారత్.. సిరీస్ గెలవాలంటే ఈ రోజు ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సఫారీ గడ్డపై వరుసగా రెండో సిరీస్ ను అందుకునే అవకాశాలు ఉంటాయి. అయితే తొలి వన్డేలో కెప్టెన్ KL రాహుల్ పెద్ద గా ఆకట్టుకోలేక పోయాడు. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ పరుగుల వరద పారిస్తుంటే.. సరైన బౌలర్ ను దించడంలో రాహుల్ విఫలమయ్యాడని ఆరోపణలు వస్తున్నాయి. అయ్యర్ తో బౌలింగ్ వేయించలేకపోవడంపై రాహుల్ పై విమర్శలు వచ్చాయి. దీంతో ఇవాళ్టి మ్యాచ్ వ్యూహాలపై అందరికి ఆసక్తి ఉంది. 
ఇక భారత్ ను మిడిలార్డర్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. తొలి మ్యాచ్ లో శిఖర్ ధావన్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్ బాధ్యతలు వదులుకొని పూర్తి స్వేచ్ఛగా ఉన్న కోహ్లీ అర్ధశతకం చేశాడు. వీళ్ల తర్వాత ఏ ఒక్క మిడిలార్డర్ బ్యాట్ మెన్ గ్రీజులో నిలదొక్కుకోలేదు. చివర్లో శార్థుల్ ధనాధన్ ఇన్నింగ్ ఆడకపోతే ఓటమి తేడా దారుణంగా ఉండేదని అంటున్నారు. అయ్యర్ ను స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా ఆడించకుంటే.. అతడి కన్నా అనుభవజ్ఞుడు సూర్యకుమార్ ను తీసుకోవడం బెటర్ అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. ఒత్తిడిలోనూ సూర్యకుమార్ అద్భుతంగా రాణించగలడు.  ఇవాళ్టి మ్యాచ్ లో పంత్, శ్రేయాస్, వెంకటేశ్ అయ్యర్లు బ్యాట్లకు పనిచెప్పకపోతే మరో ఒటమి తప్పదని అంటున్నారు. ఇక వన్డే సిరీస్ ను ఈ మ్యాచ్ ద్వారానే దక్కించుకోవాలని సఫరీ జట్టు చూస్తోంది. కెప్టెన్ బవూమా, డుస్సపెన్ సూపర్ ఫాంలో ఉన్నారు. ఓపెనర్ డికాక్ కూడా రాణిస్తే భారత్ కష్టాలు తప్పవు. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు ఎలాంటి మార్పు చేయడం లేదు.