
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఉద్రిక్తల పరిస్థితుల మధ్య ఐపీఎల్ 2025కి గ్యాప్ రావడంతో షెడ్యూల్ జూన్ 3 వరకు పొడిగించాల్సి వచ్చింది. దీంతో ఫారెన్ ప్లేయర్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. విదేశీ ప్లేయర్లు ఐపీఎల్ లో ఆడతారా లేదా అనే విషయంలో అనుమానాలు నెలకొన్నాయి. అయితే క్రికెట్ వెస్టిండీస్ మాత్రం తమ ప్లేయర్లను ఐపీఎల్ ఆడుకోవడానికి పర్మిషన్ ఇచ్చి గుడ్ న్యూస్ చెప్పింది. షెడ్యూల్ ప్రకారం వెస్టిండీస్ ఈ నెల 21 నుంచి ఐర్లాండ్ తో మూడు వన్డేల సిరీస్.. మే 29 నుంచి ఇంగ్లాండ్ తో మూడు వన్డే సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్ ఆడబోయే ఈ సిరీస్ లకు ఐపీఎల్ షెడ్యూల్ క్లాష్ అవుతుంది.
మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లకు వెస్టిండీస్ ప్లేయర్లు ఆడాలని రిక్వెస్ట్ చేయగా.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వంటి జట్లకు కలిసి వస్తుంది. ప్రస్తుతం వెస్టిండీస్ వన్డే స్క్వాడ్ లో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, షామర్ జోసెఫ్ మాత్రమే ఉన్నారు. లక్నో సూపర్ జయింట్స్ షామర్ జోసెఫ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ విండీస్ పేసర్ మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లకు దూరమైనా లక్నో పెద్దగా నష్టపోయేదేమీ ఏమీ ఉండదు. రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్ ఆ ఆయా జట్లకు కీలక ప్లేయర్లు.
Also Read : అంపైరింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నహెచ్‌సీఏ
గుజరాత్ టైటాన్స్ తరపున రూథర్‌ఫోర్డ్ ఈ సీజన్ లో కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. 11 మ్యాచ్ ల్లో 159 స్ట్రైక్ రేట్‌తో 299 పరుగులు చేసి మిడిల్ ఆర్డర్ లో గుజరాత్ కు విలువైన పరుగులు చేశాడు. రూథర్ ఫోర్డ్ ఆల్ రౌండర్ అయినప్పటికీ, జట్టు అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎక్కువగా ఉపయోగించుకుంది. ఇక షెపర్డ్ విషయానికి రాయల్ ఛాలెంజర్స్ తరపున లోయర్ ఆర్డర్ లో తన పవర్ హిట్టింగ్ తో మ్యాచ్ విన్నర్ గా మారాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఐపీఎల్ లోనే సెకండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు.
ఐపీఎల్ 2025లో మొత్తం ఎనిమిది మంది వెస్టిండీస్ ఆటగాళ్లు ఉన్నారు. రూథర్‌ఫోర్డ్, షెపర్డ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రోవ్‌మన్ పావెల్, నికోలస్ పూరన్, షమర్ జోసెఫ్, షిమ్రాన్ హెట్‌మైర్ ఆడుతున్నారు. వీరిలో రూథర్‌ఫోర్డ్, షెపర్డ్, జోసెఫ్ మాత్రమే వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నారు. వెస్టిండీస్ వన్డే జట్టులో జాన్ కాంప్‌బెల్ ను రూథర్‌ఫోర్డ్ స్థానంలో..జెడియా బ్లేడ్స్‌ను షెపర్డ్ స్థానంలో ఎంపిక చేశారు.
ఐపీఎల్ రీ షెడ్యూల్ సోమవారం (మే 13) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. శనివారం (మే 17) బెంగళూరు లోని చిన్న స్వామీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మే 29 నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు.. జూన్ 3 న ఫైనల్ జరగనుంది.
Romario Shepherd and Sherfane Rutherford will be fully available to RCB and Gujarat Titans for the remainder of #IPL2025
— ESPNcricinfo (@ESPNcricinfo) May 15, 2025
🔗 https://t.co/vFqfQZ6kYp pic.twitter.com/4xaAmYlgQb