క్రైమ్ కామెడీ థ్రిల్లర్..శ్రీ సింహ భాగ్ సాలా

క్రైమ్ కామెడీ థ్రిల్లర్..శ్రీ సింహ భాగ్ సాలా

మత్తు వదలరా వంటి కామెడీ థ్రిల్లర్ సినిమాతో ఆకట్టుకున్న హీరో శ్రీ సింహ(Sree Simha).తాజాగా భాగ్ సాలా అంటూ మరో విభిన్నమైన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు.ప్రేమని సాధించుట కొరకు ఒక యువకుడు ఏ విధమైన పరుగు తీసాడు అనే నేపథ్యంతో ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తుంది.ప్రణీత్ బ్రహ్మాండపల్లి(Praneeth Bramhandapalli ) దర్శకత్వం వహిస్తున్న భాగ్ సాలా చిత్రంలో శ్రీ సింహ సరసన నేహా సోలంకి(Neha Solanki) కథానాయికగా నటిస్తోంది.

బిగ్ బెన్ సినిమాస్(Big Ben) మరియు సినీ వ్యాలీ(Cini Vyali) మూవీస్‌తో కలిసి వేదాన్ష్(Vedansh) క్రియేటివ్ వర్క్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కాలభైరవ(Kaala Bhairava) సంగీతం అందిస్తున్న ఈ మూవీ జులై 7 న రీలిజ్ కాబోతుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుతున్నట్లు యూనిట్ పేర్కోంది.

తెల్లారితే గురువారం,దొంగలున్నారు జాగ్రత్త వంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న కథలను ఎంచుకోవడం హీరో శ్రీ సింహ ప్రత్యేకత.
 ఎం ఎం కీరవాణి(MM Keeravani) కొడుకైన శ్రీ సింహ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ స్ తో రాణిస్తున్నాడు.