అప్పుడు ఫెయిల్.. ఇప్పుడు పాస్… బోర్డు పై క్రిమినల్ కేస్

అప్పుడు ఫెయిల్.. ఇప్పుడు పాస్… బోర్డు పై క్రిమినల్ కేస్

నిన్న(శుక్రవారం) విడుదల చేసిన ఇంటర్ రీ వెరిఫికేషన్ లో ఆత్మహత్య చేసుకున్న… అనామిక పాస్ అయినట్లు రిజల్డ్ వచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత రావు. అనామిక ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మే 27 సాయంత్రం జవాబు పత్రాలు అప్ లోడ్ చేస్తాం అని ఇంటర్ బోర్డ్ కోర్టుకి చెప్పిందని..అయితే ఇప్పటి వరకు చేయకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న పిల్లలెవరూ పాస్ కాలేదని బోర్డ్ చెప్పింది…కానీ ఆత్మహత్య చేసుకున్న అనామిక పాస్ అయ్యిందన్నారు. దీనిపై సెక్షన్ 304(A) ఇంటర్ బోర్డ్ నెగ్లిజెన్స్ కేసు ఫైల్ చేస్తామని చెప్పారు. కోర్టు చెప్పక ముందే ప్రభుత్వం అశోక్ కుమార్ ను అరెస్టు చేస్తే బాగుంటుందన్నారు అచ్యుత రావు.

రీ వెరిఫికేషన్ లో తన చెల్లికి 48 మార్కులు వచ్చాయని తెలిపింది అనామిక అక్క ఉదయ. చెల్లి ఆత్మహత్యకు కారణమైన ఇంటర్ బోర్డుపై క్రిమినల్ కేసు పెడతామని చెప్పారు.

ఇంటర్‌ పరీక్షల్లో తప్పాననే మానసిక వేదనతో ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ కు చెందిన అనామిక ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లోని చాచా నెహ్రూనగర్‌లో నివసిస్తున్న అమ్మమ్మ ఇంట్లో అనామిక ఉంటూ కోఠిలోని ప్రగతి మహావిద్యాలయంలో సీఈసీ మొదటి సంవత్సరం చదివింది.