OTT Crime: క్రైమ్ థ్రిల్లర్ వచ్చేస్తోంది.. గర్ల్‌ఫ్రెండ్‌ను చంపే డాక్టర్.. హత్యకు హెల్ప్ చేసిన భార్య!

OTT Crime: క్రైమ్ థ్రిల్లర్ వచ్చేస్తోంది.. గర్ల్‌ఫ్రెండ్‌ను చంపే డాక్టర్.. హత్యకు హెల్ప్ చేసిన భార్య!

పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్‌‌‌‌లో వచ్చిన వెబ్ సిరీస్‌‌‌‌ ‘క్రిమినల్ జస్టిస్‌‌‌‌’.ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు సీజన్స్‌‌‌‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో నాలుగో భాగాన్ని సిద్ధం చేశారు.‘క్రిమినల్ జస్టిస్‌‌‌‌4: ఎ ఫ్యామిలీ మ్యాటర్‌‌‌‌‌‌‌‌’టైటిల్‌‌‌‌తో తెరకెక్కిన నాలుగో సీజన్‌‌‌‌కు రోషన్ సిప్పీ దర్శకుడు. బీబీసీ స్టూడియోస్‌‌‌‌ నిర్మించింది. లేటెస్ట్గా ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. 

“ఈసారి నిజానికి రెండు కాదు మూడు కోణాలు ఉన్నాయి. మిశ్రాజీ కెరీర్లో అత్యంత ముఖ్యమైన కేసును చూడటానికి మరికొన్ని రోజులు వేచి చూడండి. హాట్‌స్టార్ స్పెషల్స్ క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్ మే 29 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో  సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్ ట్వీట్ చేసింది.

ట్రైలర్ ఎలా ఉందంటే:

తన గర్ల్‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌ను మర్డర్‌‌‌‌‌‌‌‌ చేశాడనే ఆరోపణతో ముంబైలోని ప్రముఖ డాక్టర్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌ నాగ్‌‌‌‌పాల్‌‌‌‌ (మహ్మద్ జీషన్ అయ్యుబ్)ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ట్రైలర్‌‌‌‌‌‌‌‌ మొదలైంది.

ఈ కేసు విషయంలో అతని భార్య అంజు (సుర్విన్ చావ్లా).. లాయర్‌‌‌‌‌‌‌‌ మాధవ్ మిశ్రా (పంకజ్ త్రిపాఠి)ని సంప్రదిస్తుంది. తాను ఆ హత్య చేయలేదని, కాపాడటానికి ప్రయత్నించానని చెబుతాడు రాజ్ నాగ్‌‌‌‌పాల్. కానీ సాక్ష్యాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉంటాయి. హత్యకు సహకరించిందని అతని భార్యను కూడా అరెస్ట్ చేస్తారు.

లాయర్‌‌‌‌‌‌‌‌ మాధవ్ మిశ్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌ లేఖ (శ్వేతా బసు ప్రసాద్‌‌‌‌) కోర్టులో పోటాపోటీగా తమ వాదనలు వినిపిస్తారు. ఇంతకూ ఈ కేసులో అసలు ఏం జరిగింది, కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వచ్చింది అనేది మిగతా కథ. మే 29 నుంచి ఇది జియో హాట్‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.