
- నేరస్తుల గుర్తింపునకు ఐరిస్ టెక్నాలజీ
- దేశంలోనే తొలిసారి తెలంగాణలో అమలు
- వరంగల్ కమిషనరేట్‌లో తొమ్మిది స్టేషన్ల ఎంపిక
- సిబ్బందికి ఏఎంఎఫ్పీఐ సిస్టమ్ పరికరాల అందజేత
హనుమకొండ, వెలుగు: నేరాలకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఆటోమేటెడ్ మల్టీమోడల్ ఫింగర్ప్రింట్ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ను అమలు చేస్తున్నారు. కొత్త టెక్నాలజీలో భాగంగా నిందితుల వేలిముద్రలతో పాటు ఐరిస్, ముఖం, పాద ముద్రలను కూడా సేకరించి భద్రపరుస్తారు.
చోరీలు, హత్యలు, ఇతర ఘటనలు జరిగినప్పుడు కచ్చితంగా నేరస్తులను గుర్తించేందుకు టెక్నాలజీ ఉపయోగపడనుంది. దీన్ని తెలంగాణ ఫింగర్ప్రింట్విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. మొదట హైదరాబాద్కమిషనరేట్ లో రెండు, సిద్దిపేట, వరంగల్ కమిషనరేట్ లోని హనుమకొండ స్టేషన్లలో పైలట్‌ప్రాజెక్టుగా అమలు చేశారు. అది సక్సెస్‌కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టారు.
వరంగల్ కమిషనరేట్పరిధిలో ఫస్ట్‌ఫేజ్ లో తొమ్మిది స్టేషన్లలో కొత్త టెక్నాలజీ పరికరాలను ఇన్స్టాల్ చేయనున్నారు. సెంట్రల్ జోన్ పరిధిలో 6, ఈస్ట్ జోన్ లో రెండు, వెస్ట్ జోన్ లో ఒక స్టేషన్ లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. తెలంగాణ ఫింగర్ ప్రింట్ విభాగం మంజూరు చేసిన పరికరాలను వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ కమిషనరేట్ ఫింగర్ప్రింట్సిబ్బందికి అందజేశారు.
నేరస్తులను పట్టుకోవడంలో ఫింగర్‌ప్రింట్ విభాగంతో పాటు ఏఎంఎఫ్పీఐ సిస్టమ్ కీలకంగా పని చేస్తున్నందని చెప్పారు. వరంగల్ కమిషనరేట్సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిపారు. వరంగల్ కమిషనరేట్ ఫింగర్ ప్రింట్‌ఇన్ స్పెక్టర్లు రాజ్‌కుమార్, శ్రీధర్, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.