
సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీకి కొందరు దుండగులు బెందిరింపు లేఖలు పంపారు. ఈ ఘటన మెస్సీ సొంత నగరం రొసారియోలో జరిగింది. మెస్సీ భార్య కుటుంబానికి చెందిన సూపర్ మార్కెట్ పై ఇద్దరు దుండగులు తెల్లవారుజామున 14 రౌడ్ల కాల్పులు జరిపారు. అక్కడ ‘మెస్సీ, నెక్స్ట్ నువ్వే. నీ కోసం ఎదురు చూస్తున్నాం. జావ్నిన్ ఓ నార్కో (డ్రగ్ డీలర్). అతను మిమ్మల్ని కాపాడలేడు’ అనే లేఖను వదిలిపెట్టి వెళ్లిపోయారు. అయితే, సూపర్ మార్కెట్ మూసి ఉండటంతో ఎవరికి ఎలాంటి గాయాలు కలుగలేదు.
అయితే, ఈ దాడి నగరంలో గందరగోళం సృష్టించడానికి తప్ప వేరే ఉద్దేశం లేదని రొసారియో పోలీసులు స్పష్టం చేశారు. ‘దీనివల్ల దుండగులకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. వైరల్ అవ్వడానికి, ప్రజలు ఈ ఘటన గురించి కొంతకాలం మాట్లాడుకోవడానికి, వాళ్లపై దృష్టిని మరల్చడానికే ఇలా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా డ్రగ్ మాఫియా పనే. దీనివల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం లేద’ని అన్నారు.