
క్రీడాకారులకు కార్లంటే పిచ్చి. మార్కెట్లోకి కొత్త కారు వచ్చిదంటే చాలు..రేటు ఎంతైనా పర్లేదు..కొనేస్తుంటారు..తమ గ్యారేజీలో పెట్టేస్తుంటారు. ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు కూడా కార్లంటే విపరీతమైన ఇష్టం. ఇప్పటికే అతని గ్యారేజీలో అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా రొనాల్డో కొత్త కారును కొన్నట్లు తెలుస్తోంది.
కొత్త లగ్జరీ కారు..
స్పెయిన్లోని మాడ్రిడ్లో ఓ రెస్టారెంట్కు తన వైఫ్ జార్జినా రోడ్రిగ్స్తో కలిసి క్రిస్టియానో రొనాల్డో కొత్త కారులో వచ్చాడు. డిన్నర్ అనంతరం బయటకొచ్చాడు. ఈ సమయంలో రొనాల్డోను చూసిన అభిమానులు..సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో రొనాల్డో కొత్త కారును కూడా అభిమానులు ఫోటో తీశారు. రొనాల్డో కొత్త కారు అంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అయ్యాయి.
కారు ఎంతో తెలుసా..
రొనాల్డో కొన్న కొత్త కారు గురించి కొందరు అభిమానులు ఆరా తీశారు. ఈ క్రమంలో ఆ కారు గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. రొనాల్డో కొన్న కారు ఫ్రాన్స్ దేశానికి చెందినది. అక్కడ లగ్జరీ కార్లను తయారు చేసే బుగాటి..సెంటోదియాచి పేరుతో కారును తయారు చేసింది. దీని ధర అక్షరాల 80 లక్షల యూరోలు. అంటే భారత కరెన్సీలో దాదాపుగా రూ.71 కోట్లు అన్నమాట. ఇదే కారులో రొనాల్డో తన పార్ట్ నర్ తో కలిసి మాడ్రిడ్ రెస్టారెంట్ రావడం విశేషం.
సౌదీ లీగ్ లో...
ఫిఫా వరల్డ్ కప్ 2022లో పేలవ ప్రదర్శన చేసిన క్రిస్టియానో రొనాల్డో ..ఆ తర్వాత మాంచెస్టర్ యునైటెడ్తో తెగదెంపులు చేసుకున్నాడు. ప్రస్తుతం సౌదీ లీగ్లో అల్ నసర్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. ఈ క్లబ్ తరపున మెరుగైన ప్రదర్శనే చేస్తున్నాడు. ప్రస్తుతం సౌదీ లీగ్ లో ఆడుతున్న రొనాల్డో...యూరో కప్ 2024 క్వాలిఫయర్స్ మ్యాచులో అతను రెండు మ్యాచుల్లో 4 గోల్స్ సాధించాడు. ప్రస్తుతం వచ్చే ఏడాది జరిగే యూరో కప్ 2023లో పాల్గొనడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.