Prabhas : 'సలార్ 2' టీజర్ లోడింగ్? రిపబ్లిక్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే!

Prabhas : 'సలార్ 2' టీజర్ లోడింగ్? రిపబ్లిక్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే!

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజీలో ఉంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన 'ది రాజా సాబ్' చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన పొందినప్పటికీ .. బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదు. రాబోయే తన తదుపరి చిత్రాలతో రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్నాయి. 'సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డులు మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి దాని సీక్వెల్ 'సలార్: పార్ట్ 2 - శౌర్యాంగ పర్వం' పైనే ఉంది. ఈ నేపథ్యంలో నెట్టింట ఒక క్రేజీ అప్‌డేట్ తెగ వైరల్ అవుతోంది.

జనవరి 25న 'సలార్ 2' టీజర్?

గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 25, 2026న 'సలార్ 2' నుంచి ఒక అనౌన్స్‌మెంట్ టీజర్ లేదా గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే హోంబలే ఫిలిమ్స్ సంస్థ నుంచి  ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, అభిమానులు మాత్రం ఈ అప్‌డేట్ కోసం ఎంతో ఆత్రుతగా ఉన్నారు. అయితే, మరోవైపు చిత్ర బృందం ప్రస్తుతం తమ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ టీజర్ రాకపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఖాన్సార్‌లో రక్తపాతం..

మొదటి భాగంలో స్నేహితులుగా ఉన్న దేవ (ప్రభాస్), వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) రెండో భాగంలో శత్రువులుగా ఎలా మారతారనేదే ఈ సినిమా ప్రధానాంశం. దేవ 'శౌర్యాంగ' తెగకు చెందినవాడనే ట్విస్ట్‌తో పార్ట్ 1 ముగిసింది. ఖాన్సార్ సింహాసనం కోసం జరిగే ఈ మహా యుద్ధంలో 'శౌర్యాంగ పర్వం' ఏ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను చూపించబోతుందో అన్న దానిపై ప్రేక్షకుల్లో ఉత్కంఠత నెలకొంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం..

ప్రభాస్ లైనప్.. ఒకదానిని మించి మరొకటి!

ఇటీవల ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' మూవీ మిశ్రమ స్పందన పొందినప్పటికీ.. ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న పవర్ ఫుల్ కాప్ డ్రామా స్పిరిట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మార్చి 5, 2027గా ఖరారు చేశారు. ఈ మూవీలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక రఫ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. అంతే కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక పిరియాడికల్ యాక్షన్ డ్రామా ఫౌజీ (Fauji) లో ప్రభాస్ నటిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక నాగ్ అశ్విన్ విజువల్ వండర్ 'కల్కి 2898 AD' సీక్వెల్ .కల్కి 2 'పనులు కూడా సమాంతరంగా సాగుతున్నాయి.

►ALSO READ | Krithi Shetty: చిరు కుమార్తెగా 'ఉప్పెన' బ్యూటీ? క్లారిటీ ఇచ్చిన మెగా 158 టీమ్!

అయితే 'సలార్ 2' షూటింగ్ 2026 మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ జనవరి 25న టీజర్ వస్తే మాత్రం అది బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయం. అప్పటి వరకు డార్లింగ్ అభిమానులు అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే మరి..