
కాంగ్రెస్ ఎంపీలకు అసెంబ్లీ, లోక్‌సభకు తేడా తెలియడం లేదని, అందుకే గల్లీ ముచ్చట్లు ఢిల్లీలో మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మంగళవారం ఎద్దేవా చేశారు. లోక్‌సభలో సీఎం కేసీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజాభిమానంతో నంబర్‌వన్ పొజిషన్ వస్తుంది కానీ లీడర్లను చేర్చుకుంటే రాదని బీజేపీని ఉద్దేశించి అన్నారు.
ముక్కు నేలకు రాయాలి
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేకుంటే ముక్కు నేలకు రాయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. కేటీఆర్ అండతో కబ్జాలు చేశామంటూ అడ్డగోలు విమర్శలు చేశారని, వాటికి ఆధారాలుంటే చూపించాలన్నారు. తనపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమైతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని శంభీపూర్ రాజు సవాల్ చేశారు.