వీఐపీ స్టిక్కర్స్ దుర్వినియోగంపై విమర్శలు

వీఐపీ  స్టిక్కర్స్  దుర్వినియోగంపై విమర్శలు

జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 వద్ద ప్రమాదానికి గురైన కారు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. యాక్సిడెంట్ కు కారణం అయిన కారుపై బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెలే షకీల్ పాషా పేరుతో స్టిక్కర్ ఉండటం చర్చనీయాంశంగా మారింది. వాహనాలపై వీఐపీల స్టిక్కర్ల వాడకంపై నియంత్రణ సరిగా లేకపోవడంతో మిస్ యూజ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  నిన్న జరిగిన కారు ప్రమాదంలో  చిన్నారి ప్రాణం బలైంది. మరో ఇద్దరు అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  ప్రమాదానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

వీఐపీల కార్ పాస్ స్టిక్కర్ల వాడకంపై మానిటరింగ్ , నియంత్ర లేక పోవడంతో.. ఎవరు వాడుతున్నారు. అసలు  ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలే స్టిక్కర్స్  వాడుతున్నారా? లేదా అనేది మానిటరింగ్ లేక పోవడంతో ఎవరు పడితే వారు స్టిక్కర్లు అతికించుకుని రోడ్లపై తిరుగుతున్నారు. ఈ స్టిక్కర్స్ ను ఎంపీలకు పార్లమెంటరీ విభాగం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ నుంచి  జారీ చేయబడతాయి.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ కార్యదర్శి ప్రతి సవంత్సరం మార్చి ,  ఎప్రిల్ లో స్టిక్కర్స్ జారీ చేస్తారు. జారీ చేసిన పాస్ లకు  సంవత్సరం పాటు వాలిటీడీ ఉంటుంది. ప్రతి ఇయర్ మార్చ్ నెలాఖరు వరకు గడువు ఉంటుంది. ఎమ్మెల్యేకు ఎన్ని జారీ చేస్తారో .. ఎమ్మెల్సీకి అన్నే పాస్ లు  జారీ చేస్తారు.  ఒక సభ్యునికి రెండుకు మించకుండా జారీ చెయ్యాలని నిబంధన ఉంది.  ప్రజెంట్ ఈ కోటాను  రెండు నుంచి మూడుకి  పెంచారు. అయితే ఈ స్టిక్కర్లను  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ  వాళ్ల కుంటుంబ సభ్యులే  కాకుండా వారి అనుచరులు, సన్నిహితులు వాడుతూ దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  తమ పరపతిని ఉపయోగించుకోవడానికి, టోల్స్ వద్ద , పోలీసుల తనిఖీల వద్ద ఈజీ ఎంట్రీ కోసం ఈ స్టిక్కర్లను వాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

వీఐపీ కార్ పాస్ స్టిక్కర్లే కాకుండా వివిధ రకాల సైరెన్స్ తో రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. సిటీ రోడ్లపై అలాంటి వాహానాలు కనిపించినా  పోలీసులు సైతం పటించుకోవడం లేదు. ప్రోటోకాల్ కు విరుద్దంగా సైరెన్స్ వాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి.. కానీ పోలీసులు ఇవేవి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.