
గద్వాల టౌన్, వెలుగు: గద్వాల టౌన్ లోని హమాలీ కాలనీలో ఇళ్ల మధ్యలోకి మంగళవారం మొసలి వచ్చింది.కాలనీవాసుల వివరాలు మేరకు.. మంగళవారం తెల్లవారుజామున కాలనీకి చెందిన తిరుపతి ఇంటి సమీపంలోకి మొసలి వచ్చింది. రైల్వే డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఆయన రాత్రి డ్యూటీ కి వెళ్తూ కుక్కలు అరవడం చూసి ఇంటి సమీపంలోకి వెళ్లి చూడగా మొసలిని గుర్తించాడు.
విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలిపారు. వెంటనే అందరూ అక్కడికి చేరుకొని దానిని తాళ్లతో బంధించారు. ఉదయం ఫారెస్ట్ ఆఫీసర్లకు మొసలిని అప్పగించారు. జూరాల కాలువ నుంచి మొసలి కాలనీలోకి వచ్చి ఉంటుందని కాలనీవాసులు తెలిపారు.