మొసలి మెడకు టైరు.. తీసేస్తే రివార్డు

మొసలి మెడకు టైరు.. తీసేస్తే రివార్డు

అది ఇండోనేషియాలోని సెంట్రల్ సులవెసి ప్రావిన్స్… అక్కడి పలూ నదిలో 4 మీటర్ల పొడవైన మొసలి ఉంది. పాపం దీనికి ఓ పెద్ద కష్టం వచ్చింది. మోటార్ సైకిల్ టైరు దాని మెడకు చుట్టుకుంది. ఇది 2016లో జరిగింది. అప్పటి నుంచి ఆ మొసలి అలాగే బతుకుతోంది. అయితే ఆ టైరు మొసలి మెడకు బిగుసుకుంటోందని, తొలగించకపోతే ప్రమాదమని అధికారులు గుర్తించారు. టైరును తొలగించేందుకు ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అవేవీ ఫలించలేదు. దీంతో ఆఫీసర్లు ఓ నిర్ణయానికి వచ్చారు. ఎవరైనా ధైర్యం చేసి ముందుకొచ్చి, మొసలి మెడకున్న టైరును తొలగిస్తే ఊహించని రివార్డు ఇస్తామని ప్రకటించారు. రివార్డు ఏమిటన్నది మాత్రం చెప్పలేదు.