క్రాప్‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌ కిందకు రైతుబంధు, వడ్ల పైసలు పట్టుకుంటున్రు

క్రాప్‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌ కిందకు రైతుబంధు, వడ్ల పైసలు పట్టుకుంటున్రు
  • మెదక్‌‌‌‌‌‌‌‌  జడ్పీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో సభ్యుల ఆగ్రహం
  •     రైతుల అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్నారని మండిపాటు
  •     ఇంకా రెండుమూడు వేల మందికి రైతుబంధు ఎందుకు రాలే
  •     అగ్రికల్చర్​ఆఫీసర్ల తీరుపై ఎమ్మెల్సీ సుభాష్​ రెడ్డి అసహనం 

మెదక్, వెలుగు: బ్యాంకర్లు క్రాప్​లోన్​ కిందకు రైతుబంధు, వడ్ల పైసలు పట్టుకుంటున్నారని జడ్పీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతులను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు కరెక్ట్‌ అని ప్రశ్నించారు.  మంగళవారం మెదక్‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో జడ్పీ చైర్​ పర్సన్​ హేమలత అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్​మీటింగ్ నిర్వహించారు.   అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖపై చర్చ సందర్భంగా శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ శివ్వంపేట ఇండియన్​ బ్యాంక్​ పరిధిలోని గ్రామాల రైతులకు రైతు బంధు, వడ్లు అమ్మిన పైసలు ఇవ్వడం లేదని సభ దృష్టికి తెచ్చారు.  రైతులతో పాటు లోన్‌‌‌‌‌‌‌‌కు గ్యాంరటీ ఉన్న వారు బాకీ ఉన్నా సంబంధిత రైతుల అకౌంట్లు ఫ్రీజ్​ చేసి డబ్బులు డ్రా చేసుకోనివ్వడం లేదని మండిపడ్డారు.  జడ్పీ వైస్​ చైర్​ పర్సన్​ లావణ్య రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని చాలా మండలాల్లో ఇదే పరిస్థితి ఉందని,   పింఛన్‌‌‌‌‌‌‌‌ డబ్బులు కూడా డ్రా చేసుకోనివ్వకుండా అకౌంట్లు ఫ్రీజ్​ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తమ  మండలాల్లోనూ ఈ సమస్య  ఉందని వెల్దుర్తి జడ్పీటీసీ రమేశ్​, కొల్చారం ఎంపీపీ మంజుల  చెప్పారు. ​దీనిపై కలెక్టర్​ రాజర్షిషా స్పందిస్తూ సంబంధిత బ్యాంకులకు వెళ్లి సమస్య  పరిష్కరించాలని లీడ్​ బ్యాంక్ మేనేజర్​ వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు.  

ఏఈవోలు ఏం చేస్తున్నరు?

ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రెండుమూడు వేల మందికి రైతులకు రైతుబంధు సాయం అందలేదని, కారణమేంటని  డీఏవోను ప్రశ్నించారు.  ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవో ఉన్నా.. ఏం చేస్తున్నారని మండిపడ్డారు.  వారి క్లస్టర్​ పరిధిలో ఏఏ రైతులకు రైతుబంధు అందలేదో తెలుసుకోవాలే తప్ప.. రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు.  స్పందించిన కలెక్టర్​ ఏఈవో వారీగా రైతుబంధు సాయం ఎంతమందికి వచ్చింది..? ఇంకా ఎంత మందికి రాలేదో?  రిపోర్ట్​ అందజేయాలని డీఏవో ఆశాకుమారిని ఆదేశించారు. అనంతరం వైద్యశాఖపై ఎమ్మెల్సీ మాట్లాడుతూ  మెదక్​ ఎంసీహెచ్‌‌‌‌‌‌‌‌లో సిజేరియన్​ అయిన తరువాత చాలా మంది బాలింతలకు ఇన్​ఫెక్షన్లు సోకుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని , కారణమేంటని  సూపరింటెండెంట్​చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందని, రెండు, మూడు సార్లు సిజేరియన్​ అయిన వారిలో ​రక్తహీనత సమస్య ఉండడం, ఇమ్యునిటీ తగ్గడం వల్ల ఇన్​ఫెక్షన్లు సోకుతున్నాయని ఆయన సమాధాన ఇచ్చారు.  ఎంసీహెచ్​లో ఇప్పటి వరకు 11 మందికి ఈ సమస్య వచ్చిందని వివరించారు. 

ప్రైవేట్​ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ తనిఖీ చేశారా..?

 ప్రైవేట్​ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో ట్రీట్​మెంట్​, సర్జరీలకు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకంటే చాలా ఎక్కువ వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, తనిఖీలు చేసి ఏమైనా చర్యలు తీసుకున్నారా..? అని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో చందునాయక్​ను ప్రశ్నించారు.  ఆయన స్పందిస్తూ  ఆస్పత్రులు తనిఖీ చేసి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు డిస్​ప్లే చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  పీహెచ్​సీ అడ్వైజరీ కమిటీల్లో తమకు స్థానం కల్పించకపోవడంపై నార్సింగి జడ్సీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీపీ సబిత అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి బిల్డింగ్ అధ్వాన్నంగా మారిందని,  డ్రైనేజీ, కరెంట్​ సమస్యలున్నా పట్టించుకోవడంలేదని  నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్​ కుమార్​ డీసీహెచ్​ డాక్టర్​ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మండిపడ్డారు.    డీసీహెచ్​ స్పందిస్తూ జిల్లా ఆస్పత్రిగా అప్ గ్రేడ్​ కాలేదని, ఏరియా ఆసుపత్రిగానే ఉండటంతో ఎమ్మెల్యే చైర్మన్​గా అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేశామన్నారు.  

ఇట్లయితే వచ్చే మీటింగ్​కు రాం..

జడ్పీ మీటింగుల్లో లేవనెత్తిన సమస్యలు పరిష్కా రం కావడం లేదని, ఇలాగైతే మీటింగ్‌‌‌‌‌‌‌‌లు ఎందుక ని నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్​ కుమార్ నిలదీశారు. ఫస్ట్​  మీటింగ్‌‌‌‌‌‌‌‌లో చెప్పిన సమస్యలు ఇప్పటికీ ఇలాగే ఉన్నాయని అధికారులు సమస్య లు రాసుకునుడే తప్ప పరిష్కారం కావడం లేదని వాపోయారు.  ప్రభుత్వ పనులు, కార్యక్రమాల గురించి తమకు సమాచారం ఇవ్వడం లేదని నా ర్సింగి ఎంపీపీ సబిత అసంతృప్తి వ్యక్తం చేశారు.  

పైసలిస్తేనే పనులు చేస్తున్రు

కరెంట్​ డిపార్ట్​మెంట్​ వాళ్లు చిన్న చిన్న పనులు కూడా చేయడం లేదని, లైన్‌‌‌‌‌‌‌‌మెన్లు పైసలిచ్చినోళ్లకే పనులు చేస్తున్నారని  చేగుంట ఎంపీపీ శ్రీనివాస్​ ఆరోపించారు.  ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యకత్ం చేశారు.  టేక్మాల్ మండలం కుసంగిలో ట్రాన్స్ ఫార్మర్​ షిఫ్టింగ్​ విషయంలో  కరెంట్ ఏఈ సహకరించడం లేదని కోఆప్షన్​ మెంబర్​ యూసుఫ్​ సభ దృష్టికి తెచ్చాడు. 
తాము సొంత ఖర్చుతో ఆ పని చేసు కుంటామన్న డిపార్ట్​మెంట్​అవకాశం ఇవ్వడంలేదని వాపోయారు. సమావేశం లో జడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు 
అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.