
పొలానికి వాస్తు ఉంటుందా.. ఎలాంటి పొలంలో ఏఏ పంటలు వేయాలి.. వాస్తును బట్టి పొలం వేయాలా.. పంట పొలాల విషయంలో వాస్తు కన్సల్టెంట్ కాశీనాథునిశ్రీనివాస్ ఏమంటున్నారో చూద్దాం. . .
ప్రశ్న: పంట పొలాలకు వాస్తు ఉంటుందా? ఉంటే ఎలా పాటించాలి. నాకు దీర్ఘ చతురస్రాకారంలో నాలుగున్నర ఎకరాల పొలం ఉంది. వాస్తును బట్టి పంటలు వేయాల్సి ఉంటుందా?
జవాబు : పొలం చతురస్రాకారంలో ఉంటే మంచిది. అలా లేకున్నా పెద్దగా సమస్యలు ఏమి ఉండవు. కాకపోతే బోరు మాత్రం సరైన ప్లేస్ లో వేసుకోవాలి. అంతేకానీ.. వాస్తును బట్టి పంటలు వేయాల్సిన పనిలేదు. భూమిలోని సారం, కాలానికి అనుగుణంగా పంటలు వేసుకుంటే లాభాలు వస్తాయి. వాస్తు బాగుంటే పంట బాగా పండుతుంది అనేది కూడా అపోహ మాత్రమేనని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ అంటున్నారు.