భక్తులతో భద్రాద్రి కిటకిట

భక్తులతో భద్రాద్రి కిటకిట

భద్రాచలం, వెలుగు :  వీకెండ్​ ఎఫెక్ట్​ శనివారం రామాలయంలో కన్పించింది. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఉదయం నుంచే క్యూలైన్లన్నీ నిండిపోయాయి. దీనితో నిత్య కల్యాణ వేదికను చిత్రకూట మండపానికి మార్చాల్సి వచ్చింది. గర్భగుడిలో స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. భద్రుని మండపంలో రామపాదుకలకు పంచామృతాలతో అభిషేకం చేసి, గర్భగుడిలో శ్రీసీతారాచమంద్రస్వామి మూలవరులకు సువర్ణ తులసీ దళాలతో అర్చన నిర్వహించారు.

చిత్రకూట మండపంలో 75 జంటలు నిత్య కల్యాణంలో కూర్చున్నాయి. కంకణాలు ధరించిన వారు క్రతువును నిర్వహించారు. రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.