
వానలు తగ్గడం, వీకెండ్ కావడంతో ట్యాంక్‌బండ్ వద్ద సందర్శకుల రద్దీ పెరిగింది. చిన్నాపెద్దా, యువత హుస్సేన్ సాగర్ వద్ద ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. వరుస వానలకు కొన్నిరోజులుగా కళ తప్పిన ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ఏరియాలు సందర్శకులు,చిరు వ్యాపారులతో కలర్ ఫుల్‌గా కనిపించాయి. - వెలుగు, హైదరాబాద్