
మెదక్‌టౌన్, వెలుగు: మెదక్చర్చికి ఆదివారం భక్తులు ఎక్కువ సంఖ్యలోనే తరలివచ్చారు. ఉదయం శిలువ ఊరేగింపు నిర్వహించగా మధ్యాహ్నం చర్చి ప్రెసిబిటరీ ఇన్చార్జి శాంతయ్య దైవసందేశాన్ని అందించారు. అనంతరం చర్చి ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా పలువురు చర్చి కమిటీ సభ్యులు సువార్త ప్రకటన వినిపించారు. చర్చి కమిటీ సభ్యుల గీతాలాపనలు పలువురిని ఆకట్టుకున్నాయి.
దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోల్‌బంగ్లా వెళ్లే రోడ్డులో చెట్ల కింద వంటలు చేసుకున్నారు. మెదక్ చర్చికి మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర వంటి దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిటీ మెంబర్లు, సంఘస్తులు పాల్గొన్నారు.