నువ్వు మా మమ్మీ కాదు.. మేకప్ లో గుర్తు పట్టలేని కొడుకు

నువ్వు మా మమ్మీ కాదు.. మేకప్ లో గుర్తు పట్టలేని కొడుకు

తల్లీ కొడుకుల ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మేకప్‌లో వచ్చిన తన తల్లిని ఆ చిన్నారి గుర్తించలేదు. ఆ తర్వాత తల్లి కోసం పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. ఫంక్షన్ ఉందంటే చాలు మహిళలు మేకప్కు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మేకప్లో ఉన్న తల్లిని చూసి చిన్నారి ఏడ్చే వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

మేకప్ మహత్యం

ఇంటర్నెట్ లో నవ్వు తెప్పించే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మేకప్ వేసుకున్న తల్లిని గుర్తు పట్టక ఓ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తాడు. మేకప్ మహత్యం అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. visagesalon1 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో అందరినీ కడుపుబ్బా నవ్వు తెప్పిస్తోంది.. మరోవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మేకప్ అందాన్ని మార్చేస్తుంది. పెళ్లిళ్ల సీజన్లో ఓ తల్లి పార్టీకి మేకప్ వేసుకొని సిద్దమవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  తన కుమారుడు ఆమెను చూసి ఏడుస్తూ.. మా మమ్మీని తీసుకురావాలని పట్టుబట్టి ఏడ్చాడు. 

తల్లిని గుర్తు పట్టలేక ఏడ్చిన చిన్నారి 

ఆమె దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తుంటే గుక్కపెట్టి ఏడుస్తాడు. అంతేకాదు తన తల్లిని తనకు ఇమ్మని అడుగుతాడు. నేనే మమ్మీని అని బాలుడికి చెబుతున్నా నువ్వు నా మమ్మీవి కాదు అంటాడు. చివరకి పిల్లవాడిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె అతడిని ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తుంది. అయినా ఆమెను గుర్తించడు. ఈ వీడియో 22.8 మిలియన్ వ్యూస్ సంపాదించింది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.   వీడియోలో అందమైన మేకప్ , హెయిర్ స్టైల్‌తో నీలంరంగు లెహంగా వేసుకుని ఓ మహిళను చూసి చిన్నారి ఏడ్వడం మొదలుపెడతాడు. మేకప్‌లో ఉన్న తన తల్లిని గుర్తుపట్టలేకపోతాడు. పిల్లవాడు గుర్తించకపోతే బాగానే ఉంటుంది కానీ అతని తండ్రి గుర్తించకపోతే కష్టం అని ఒక వ్యక్తి రాశాడు. మేకప్ చాలా ప్రమాదకరమైనదని...మేజిక్ ఆఫ్ మేకప్ అని అభిప్రాయపడ్డారు. మునుపెన్నడూ తల్లిని మేకప్‌లో చూసి ఉండకపోవడం వల్ల చిన్నారి గుర్తుపట్టకపోయి ఉండవచ్చని నవ్వుకున్నారు.