జూన్​ నెలాఖరు వరకు కాస్మోటిక్​ చార్జీలు..నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలి: సీఎస్ ​రామకృష్ణారావు

జూన్​ నెలాఖరు వరకు కాస్మోటిక్​ చార్జీలు..నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలి: సీఎస్ ​రామకృష్ణారావు

హైదరాబాద్, వెలుగు: జూన్ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 6 లక్షల మంది ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు చెల్లించాలని సీఎస్​రామకృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వచ్చే నెలలో పాఠశాలలు తెరిచిన వెంటనే విద్యార్థుల ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాలకు లింక్​చేసి వారికి డెబిట్ కార్డులు మంజూరు చేయించాలని సూచించారు.

రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీల చెల్లింపులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానంపై సీఎస్​రామకృష్ణా రావు బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ చెల్లింపుల కోసం తక్షణమే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌‌‌‌ఫర్) ద్వారా ఈ చెల్లింపులు జరిగేలా కార్యక్రమం రూపొందించాలని అధికారులకు సీఎస్ సూచించారు.