నిషేధిత భూముల డేటా సేకరిస్తున్నం..హైకోర్టులో సీఎస్‌‌‌‌‌‌‌‌ అఫిడవిట్‌‌‌‌‌‌‌‌

నిషేధిత భూముల డేటా సేకరిస్తున్నం..హైకోర్టులో సీఎస్‌‌‌‌‌‌‌‌ అఫిడవిట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: నిషేధిత జాబితాలోని భూముల వివరాలను సేకరించి వాటిని సబ్‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌లకు అందజేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టుకు సీఎస్‌‌‌‌‌‌‌‌ నివేదించారు. ఈ మేరకు సీఎస్‌‌‌‌‌‌‌‌ రామకృష్ణారావు బుధవారం అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. కలెక్టర్ల నుంచి, దేవాదాయశాఖ, వక్ఫ్‌‌‌‌‌‌‌‌ బోర్డు నుంచి 22ఏలోని నిషేధిత భూముల వివరాలను నిర్దిష్ట దరఖాస్తు రూపంలో తెప్పించాలని సీసీఎల్‌‌‌‌‌‌‌‌ఏకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

 ఈ వివరాలన్నింటినీ క్రోడీకరించి సబ్‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌లకు పంపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని శంకర్‌‌‌‌‌‌‌‌హిల్స్‌‌‌‌‌‌‌‌ కాలనీలోని 475 చదరపు గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌కు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ గుప్త రియాల్టీతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ జూకంటి అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ బుధవారం విచారణ చేపట్టారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను 17వ తేదీకి వాయిదా వేశారు.