డ్రగ్స్​రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తం

డ్రగ్స్​రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తం
  • సీఎస్​ శాంతికుమారి

హైదరాబాద్, వెలుగు:  డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను మార్చే లక్ష్యంతో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేసినట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. సెక్రటేరియెట్​లో  సీఎస్​ అధ్యక్షతన నార్కో కో ఆర్డినేషన్ సెంటర్ రాష్ట్రస్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్​ మాట్లాడుతూ.. డ్రగ్స్​వినియోగాన్ని తగ్గించడానికి తగిన కార్యాచరణను రూపొందించి అమలు చేయాలన్నారు. దీనికోసం అన్ని శాఖలు సమన్వయంతో  కృషి చేయాలని సూచించారు.  వీసా గడువు ముగిసిన తరువాత కూడా దేశంలో  ఎక్కువగా ఉంటున్న విదేశీయులపై  కేంద్రం సరైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. 

ఫార్మా ఉత్పత్తి యూనిట్లు, కెమికల్ లేబొరేటరీలపై పర్యవేక్షణ పెంచాలని నిర్ణయించారు. అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో డీ-అడిక్షన్‌, రిహాబిటేషన్‌ సెంటర్లు పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. యాంటీ డ్రగ్స్‌ క్లబ్బులు ఏర్పాటు చేయాలని, డ్రగ్స్‌ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని విద్యాశాఖను సీఎస్​ కోరారు. ఈ సమావేశంలో డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్​ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సెక్రటరీ హెల్త్ రిజ్వీ, సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కరుణ, ఎస్సీ డెవలప్​మెంట్​సెక్రటరీ రాహుల్ బొజ్జా, తదితరులు పాల్గొన్నారు.