దమ్ముంటే ఎదురుగా రా.. క్రికెట్లో కాదు, బాక్సింగ్ రింగ్‌లో తేల్చుకుందాం.. హర్భజన్‌కు శ్రీశాంత్ సవాల్

దమ్ముంటే ఎదురుగా రా.. క్రికెట్లో కాదు, బాక్సింగ్ రింగ్‌లో తేల్చుకుందాం.. హర్భజన్‌కు శ్రీశాంత్ సవాల్

Sreesanth vs Harbhajan: టీమిండియా మాజీ క్రికెటర్లు ఎస్. శ్రీశాంత్, హర్భజన్ సింగ్ ల మధ్య ఉన్న పాత పగ మళ్లీ ముదిరి పాకాన పడింది. ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ అయిన స్లాప్‌గేట్ (Slapgate) వివాదం మరోసారి తెరపైకి రావడంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు బాక్సింగ్ రింగ్ ఛాలెంజ్ వరకు వెళ్లింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీశాంత్.. భజ్జీకి ఊహించని రేంజ్‌లో ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు.

రింగ్‌లోకి రా చూసుకుందాం: శ్రీశాంత్
తాజాగా 'ది లల్లన్‌టాప్' (The Lallantop) కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ మాట్లాడుతూ.. హర్భజన్ సింగ్‌తో తనకున్న విభేదాలను సెటిల్ చేసుకోవడానికి బాక్సింగ్ రింగ్ పర్‌ఫెక్ట్ ప్లేస్ అని పేర్కొన్నాడు. భజ్జీతో వన్-ఆన్-వన్ బాక్సింగ్ ఫైట్‌కు తాను పూర్తిగా రెడీగా ఉన్నానని, మరి తన ఛాలెంజ్‌ను స్వీకరించే ధైర్యం హర్భజన్‌కు ఉందా? అంటూ ఓపెన్ గానే అన్నాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

వీళ్లద్దరి మధ్య గొడవేంటి: 
ఈ లొల్లి ఈనాటిది కాదు, దాదాపు 18 ఏళ్ల క్రితం నాటి కథ! తొలి ఐపీఎల్ సీజన్ (2008) లో ముంబై ఇండియన్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. ముంబై ప్లేయర్ హర్భజన్ సింగ్, పంజాబ్ బౌలర్ అయిన శ్రీశాంత్‌ను లాగి పెట్టి చెంప మీద కొట్టాడు. అప్పట్లో శ్రీశాంత్ గ్రౌండ్ లోనే ఏడ్చేసిన విజువల్స్ పెద్ద సంచలనం సృష్టించాయి. దీనివల్ల భజ్జీ ఆ ఐపీఎల్ సీజన్ మొత్తానికి బ్యాన్ అయ్యాడు, బీసీసీఐ కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంది.

మళ్లీ ఇప్పుడెందుకు లొల్లి: 
మళ్లీ వీరిద్దరూ కలిసి 2011 వరల్డ్ కప్ గెలిచారు, అంతా నార్మల్ అయిపోయింది అనుకుంటున్న టైమ్‌లో.. ఈ మధ్యే శ్రీశాంత్ మళ్లీ ఫైర్ అయ్యాడు. గతంలో జరిగిన ‘స్లాప్‌గేట్’ ఇన్సిడెంట్‌ను బేస్ చేసుకుని ఒక కంపెనీ చేసిన అడ్వర్టైజ్‌మెంట్ (యాడ్) లో హర్భజన్ నటించి, దాని ద్వారా భారీగా డబ్బులు సంపాదించాడని శ్రీశాంత్ ఆరోపించాడు. తనను కొట్టిన సంఘటనను కమర్షియల్‌గా వాడుకుని భజ్జీ క్యాష్ చేసుకోవడం శ్రీశాంత్‌కు అస్సలు నచ్చలేదు.. దీంతో హర్భజన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశానని, అతను ఇకపై తన ఫ్రెండ్ కాదని శ్రీశాంత్ తేల్చి చెప్పాడు.

భజ్జీ రియాక్షన్: 
శ్రీశాంత్ విసిరిన బాక్సింగ్ రింగ్ ఛాలెంజ్‌పై హర్భజన్ సింగ్ ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో మీమ్స్‌తో రచ్చ లేపుతున్నారు. ఇది కేవలం మాటల యుద్ధానికే పరిమితం అవుతుందా, లేక నిజంగానే వీరిద్దరూ బాక్సింగ్ రింగ్ లో  తలపడతారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.