ప్రధాని మోడీ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు 

ప్రధాని మోడీ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు 

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 5న హైదరాబాద్ కు రానున్నారు. ముచ్చింతల్ లో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలకు
హాజరుకానున్నారు. అనంతరం ఇక్రిశాట్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
సమీక్ష నిర్వహించారు. బీఆర్కే భవన్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన ఏర్పాట్ల గురించి చర్చించారు. మోడీ పాల్గొనే కార్యక్రమాల్లో
భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తుకు బ్లూ బుక్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశింటాకుయ వీవీఐపీల పర్యటన సందర్భంగా
కొవిడ్ 19 ప్రొటోకాల్ పాటించేలా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి సూచించారు. ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే రహదారుల మరమ్మత్తు
చేపట్టాలని, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. వీవీఐపీలు సందర్శించే అన్ని ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా
చేయాలని విద్యాత్ శాఖ అధికారులను చెప్పారు.

For more news..

ఎడ్లబండిపై గురువు... బండిలాగిన విద్యార్థులు

పైలట్ అప్రమత్తతో తప్పిన ల్యాండింగ్ ప్రమాదం