పైలట్ అప్రమత్తతో తప్పిన ల్యాండింగ్ ప్రమాదం

పైలట్ అప్రమత్తతో తప్పిన ల్యాండింగ్ ప్రమాదం

పంచభూతాలలో గాలి ఒకటి. దానికున్న శక్తి ముందు అన్నీ దిగదుడుపే. ఈ నిజం మరోసారి రుజువైంది. వేగంగా వీచిన గాలి.. టన్నుల బరువుండే విమానాన్ని నెట్టిపడేసింది. ఈ ఘటన లండన్‎లోని హీత్రో విమానాశ్రయంలో వెలుగుచూసింది. బ్రిటీష్ ఎయిర్‌వేస్‎కు చెందిన జెట్ విమానం సోమవారం ఉదయం 10.50 గంటలకు అబెర్‌డీన్ నుంచి వచ్చింది. అయితే విమానం ల్యాండ్ అయ్యే సమయంలో బలమైన గాలులు వీచాయి. ఆ గాలుల తాకిడికి విమానం ల్యాండింగ్ టైంలో ఒకసైడ్ పైకి లేచింది. వెంటనే అప్రమత్తమైన పైలట్.. విమానాన్ని వెంటనే పైకి లేపాడు. మరో 10 సెకన్ల తర్వాత మరోసారి ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాడు. అయినా వీలు కుదరకపోవడంతో వెంటనే విమానాన్ని పూర్తిగా పైకి లేపాడు. పైలట్ నిర్ణయంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు, ఎయిర్ పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సరైన సమయంలో పైలట్ తీసుకున్న నిర్ణయంతో అతడు పతకానికి అర్హుడని అధికారులు పొగుడుతున్నారు.

For More News..

వ్యాక్సిన్ వల్లే నా కూతురు చనిపోయింది