95శాతం పోస్టులు స్థానికులకే

 95శాతం పోస్టులు స్థానికులకే

హైదరాబాద్: గ్రూప్ 4 నోటిఫికేషన్ పై ఉన్నతాధికారులతో సమీక్షించారు CS సోమేశ్ కుమార్. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95శాతం పోస్టులు స్థానికులకే ఇస్తామన్నారు సీఎస్. మిగిలిన ఐదు శాతం కూడా స్థానికులకే దక్కుతాయన్నారు. గ్రూప్ 4 కు సంబంధించి  రోస్టర్ పాయింట్ల వివరాలను ఈ నెల 29లోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అందజేయాలని అధికారులను ఆదేశించారు. జూనియర్ అసిస్టెంట్ లేదా దానికి సమానమైన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని CS  ఆదేశించారు. సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ క్యాడర్ లలో ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసి, జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను కూడా నోటిఫై చేయాలని పేర్కొన్నారు. ఈ స‌మావేశానికి టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్ జ‌నార్ధ‌న్ రెడ్డి, వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. గ్రూప్ – 4 ప‌రిధిలో ఖాళీగా ఉన్న‌ 9,618 పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌పై చ‌ర్చించారు. గ్రూప్-4 నోటిఫికేష‌న్ కూడా త్వ‌ర‌లోనే వెలువ‌డే అవ‌కాశం ఉందన్నారు. ఇప్ప‌టికే గ్రూప్ -1తో పాటు పోలీసు కానిస్టేబుల్స్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. 

మరిన్ని వార్తల కోసం..

RRRపై వెనక్కి తగ్గిన జీ5..ఎక్స్ ట్రా మనీ అవసరం లేదు

చనిపోయి బతికింది..ఐదుగురికి బతుకునిచ్చింది

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తారల తళుకులు