
వరుస సినిమాల్లో నటిస్తున్న ఆది సాయికుమార్ క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆది హీరోగా శివ శంకర్ దర్శకత్వంలో అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘సీఎస్ఐ సనాతన్’. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సీఎస్ఐ) ఆఫీసర్‌గా ఆది కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 10న వరల్డ్ వైడ్ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్టు మంగళవారం అనౌన్స్ చేశారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా ఉంది. హత్య కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ స్టోరీ సాగనుంది. మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, ,మధు సూదన్, వాసంతి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.