ధోనీ ఉంటాడనుకుంటున్నా: కాశీ

ధోనీ ఉంటాడనుకుంటున్నా: కాశీ

చెన్నై: వచ్చే ఐపీఎల్‌‌‌‌ సీజన్‌‌‌‌కు ధోనీ ప్లేయర్‌‌‌‌గా అందుబాటులోఉంటాడనుకుంటున్నానని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్‌‌‌‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే తన ఫ్యూచర్‌‌‌‌పై నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ మహీకే ఉందని స్పష్టం చేశాడు. ‘వచ్చే ఐపీఎల్‌‌‌‌లో ఆడతాడా లేదా నాకు తెలియదు. ధోనీ మాత్రమే సమాధానం ఇవ్వగల ప్రశ్న ఇది. మాకు కూడా ప్రశ్నగానే ఉంది. అయితే మహీ తీసుకునే నిర్ణయాన్ని మేం ఎప్పుడూ గౌరవిస్తాం.

ఆ నిర్ణయాన్ని తనకే వదిలేస్తాం. మీ అందరికీ తెలిసినట్లుగా ధోనీ తన నిర్ణయాలను సరైన టైమ్‌‌‌‌లోనే వెల్లడిస్తాడు. కానీ వచ్చే ఏడాది కూడా ఎంఎస్‌‌‌‌ అందుబాటులో ఉంటాడనే ఆశిస్తున్నాం. నేను, ఫ్యాన్స్‌‌‌‌ వేస్తున్న అంచనా ఇది’ అని కాశీ పేర్కొన్నాడు.