అహ్మదాబాద్: స్లో ఓవర్ రేట్ కారణంగా చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు జరిమానా పడింది. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్ సందర్భంగా నిర్ణీత టైమ్‌లో ఓవర్ల కోటాను పూర్తి చేయకపోవడంతో రుతురాజ్‌కు రూ. 24 లక్షల ఫైన్ వేశారు.
‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22ను రుతురాజ్ ఉల్లంఘించాడు. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది రెండో తప్పిదం. అందుకే రూ. 24 లక్షల జరిమానా పడింది. కెప్టెన్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించాం’ అని ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు.
