
ఐపీఎల్–13 లీగ్ దశలో చావో రేవో అనుకున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంది. మంగళవారం దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 20 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఆల్ రౌండర్ షోతో అదరగొట్టిన చెన్నై స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్‌తో ఉన్న సన్‌రైజర్స్‌ని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయింది. కేన్ విలియం సన్స్ (57 రన్స్) తప్పించి మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ ఫెయిల్ అవ్వడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఇచ్చిన 168 పరుగుల టార్గెట్‌ని ఛేజ్ చేయలేక సన్‌రైజర్స్ హైదరాబాద్ చతికిలపడింది. 20 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంకా రెండు వికెట్లు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్‌ని కట్టడి చేయడంలో చెన్నై విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. చెన్నై బౌలర్లలో బ్రావో(2/25), కర్ణ్ శర్మ(2/37) సన్‌రైజర్స్‌ను బాగా కంట్రోల్ చేశారు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ 38 బాల్స్‌కి 42 రన్స్, అంబటి రాయుడు 34 బాల్స్‌లో 41 రన్స్‌తో టీమ్‌ని నిలబెట్టారు. ఓపెనర్ డూప్లిసిస్ డకౌట్ అయినా ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన వాళ్లంతా మంచిగానే ఆడారు. శామ్ కరన్ (31), కెప్టెన్ ధోనీ (21 రన్స్), జడేజా (25 నాటౌట్)గా నిలిచారు.