
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ మంత్రం ఏమిటో తాను రిటైరయ్యే వరకు బయటపెట్టనని ఆజట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్నాడు. సన్ రైజర్స్ తోమ్యాచ్ అనంతరం చెన్నై విజయరహస్యమేంటి అని ధోనీని అడుగగా..‘అదో వ్యాపార రహస్యం . దాన్నిబయటపెడితే ఈ సారి వేలంలో నన్నుకొనరు’ అంటూ చమత్కరించాడు. జట్టుసాధిస్తున్న విజయాల వెనుక అభిమానుల ప్రోత్సాహంతోపాటు సహాయక సిబ్బంది కృషిని మరిచిపోలేమన్న ధోనీ.. రిటైరయ్యేదాకా మరే విషయాన్ని బయటపెట్టనని తెలిపాడు. కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న మహీ.. వరల్డ్ కప్ నేపథ్యంలో గాయం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. వెన్నులో సమస్య ఉన్నప్పటికీ అదేమంత తీవ్రంగా లేదని చెప్పిన ధోనీ.. ఒకటి రెండు గాయాలు లేని ఆటగాళ్లు ఈరోజుల్లో ఎవరూ లేరన్నాడు. పూర్తి ఫిట్ గా ఉన్నప్పుడే ఆడదామని విశ్రాంతి తీసుకుంటేమళ్లీ బరిలోకి దిగడానికి కనీసం ఐదేళ్లు వేచి ఉండాలన్న ధోనీ జట్టులో ఉన్న పోటీ గురించి పరోక్షంగా ప్రస్తావించాడు.