
మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలోని జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్మెషీన్ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదివరకు సీటీ స్కానింగ్ మెషీన్లేకపోవడంతో చాలామంది పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లి రూ.వేలల్లో ఖర్చు చేశారన్నారు.
ఇకపై ఆ సమస్య ఉండదని, ఈ మెషీన్‌ను మెదక్ పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హాస్పిటల్సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, డీసీహెచ్ డాక్టర్శివదయాల్, డాక్టర్ఏసీ.శేఖర్ పాల్గొన్నారు.